ఉన్నత అధికారులా లేక ఉత్సవ విగ్రహాలా

Submitted by sridhar on Wed, 07/09/2022 - 13:17
High officials or ceremonial idols

గద్వాల్: ప్రజాజ్యోతి ప్రతినిధి:-జిల్లా అధికారులు క్రింది స్థాయి అధికారుల పనితీరుపై పర్యవేక్షణ చెయ్యడంలో విఫలమయ్యారుఅందుకే ఐజ మున్సిపాలిటి కమిషనర్ ఇష్ట రాజ్యాంగ వ్యవరిస్తున్నారు పారిశుద్ధ్య పనులలో నిర్లక్ష్యం సిజినల్ వ్యాధులతో ప్రజలు సతమతమౌతున్నా వివిధ వార్డుల్లో కనీసం బ్లీచింగ్ పౌడర్ చెల్లకపోవడం ఫాకింగ్ చెయ్యక పోవడం మిషన్ భగీరథ పైపులు లీక్ అయ్యి త్రాగు నీరు కలుషితం అవుతున్న నిమ్మకు నీరెత్తినట్లు వ్వవహరించడం . పందులు ఊరిలో ప్రజల మధ్యలో విచ్చలవిడిగా తిరుగుతున్నా చివరికి ప్రజలపై దాడి చేస్తూ ప్రాణాలు తీసే వరకు వొచ్చిన మున్సిపాలిటీ అధికారులలో చలనం రాకపోవడం  ఉన్నత అధికారులు ఉత్సవ విగ్రహాల చూస్తూ కనీస చర్యలు తీసుకొనే పరిస్థితి కూడా లేదంటే ఇంత కంటే దౌర్భాగ్యం మరోకటి ఉండదు

నిజానికి ఎప్పటికప్పుడు ఉన్నత అధికారులు క్రింది స్థాయి అధికారుల పనితీరుపై పర్యవేక్షణ చెయ్యడం కానీ ఆకస్మిక తనిఖీలు చేపట్టడం వంటి పనులకు పునుకుంటే   మున్సిపాలిటీ అధికారులతో మార్పు వొస్తుంది, ఏదైనా తప్పు చెయ్యలన్న ఆలోచన, నిర్లక్ష్యం ఉండదు ప్రజలకు కూడా ఇబ్బందులు ఉండవు కాబట్టి ఉన్నత అధికారులు ఉత్సవ విగ్రహాలుగా ఉండకుండా నిద్ర అవస్థను వీడి క్రింది స్థాయి అధికారులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్నా అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని  ఐజ మున్సిపాలిటీ ప్రజల కోరుచున్నాం.