కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దిష్టిబొమ్మ దగ్ధం

Submitted by Sathish Kammampati on Sat, 24/09/2022 - 14:14
Effigy burning in protest against central government's anti-people policies

చిట్యాల సెప్టెంబర్ 24(ప్రజాజ్యోతి)..//. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రించటంలో పూర్తి గా విఫలం అయ్యిందని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్,అవిశెట్టి శంకరయ్య లు విమర్శించారు.చిట్యాల మండలం కేంద్రంలో శనివారం నాడు సిపిఎం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీయస్టీ పేరుతో ప్రజలందరి పై పన్నుల భారం వేయటం విచారకరమని అన్నారు.సిపిఎం కేంద్ర కమిటీ పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సిపిఎం రూరల్ మండల కార్యదర్శి అరూరి శీను,మండల నాయకులు నారబోయ్న శ్రీనివాసులు,ఐతరాజు నర్సింహ,శీలా రాజయ్య,రుద్రారపు పెద్దులు,మెట్టు నర్సింహ,అక్కనపల్లి నాగయ్య,వివిధ ప్రజా సంఘాల నాయకులు ఐతరాజు యాదయ్య, పంది నరేష్,సుర్కంటి బుచ్చి రెడ్డి,దేశబోయ్న నర్సింహ,ఈసం  రాజు,అరూరి శంభయ్య,చొప్పరి లింగయ్య తదితరులు పాల్గొన్నారు.