సంస్కృతి సంప్రదాయాలను పెంపొందించాలి

Submitted by Sathish Kammampati on Sun, 25/09/2022 - 13:19
Cultural traditions should be nurtured

 బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్న విద్యార్థినిలుగట్టు అలెక్జాండర్

చిట్యాల సెప్టెంబర్ 25(ప్రజాజ్యోతి) ..//.. నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని సెంట్ మేరీ పాఠశాలలో విద్యార్థినిలు ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. పూలతో బతుకమ్మను పేర్చి బతుకమ్మ పాటలతో ఆనందంగా  బతుకమ్మ ఆడారు. అనంతరం పాఠశాల నిర్వాహకులు గట్టు అలెగ్జాండర్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు  ఎంతో విలువైన అని కొనియాడారు. విద్యార్థుల్లో సంస్కృతి సంప్రదాయాలు చైతన్యపరిచేందుకు పాఠశాలలో బతుకమ్మ సంబరాలు నిర్వహించామని తెలిపారు. ఈ బతుకమ్మ సంబరాలలో విద్యార్థి విద్యార్థి నీల తల్లిదండ్రులు, పాఠశాల  ఉపాధ్యాయులు యాదగిరి రెడ్డి, ఎరుకొండ పద్మ, స్వాతి, లక్ష్మీ,తదితరులు పాల్గొన్నారు.