బాల్య వివాహాలు భవితకు అవరోధాలు

Submitted by Upender Bukka on Sat, 01/10/2022 - 11:22
Child marriages are hindrances to future

నాగారం  30 సెప్టెంబర్ (ప్రజా జ్యోతి) ../...బాల్యవివాహాలు భవితకు అవరోధాలని  ఎంపీపీ కూరం మణి వెంకన్న అన్నారు. శుక్రవారం  మండల కేంద్రంలో  ఎంపీడీఓ కార్యాలయంలో  మండల స్థాయి బాలల పరిరక్షణ  కమిటీ,   మరియు అడ్వైజరీ బోర్డు కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో   ఎంపీపీ  మాట్లాడుతూ బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, సమాజంలో ప్రతి ఒక్కరూ బాల్యవివాహాలను నిర్మూలించాలని   తెలిపారు.  ఈ సందర్భంగా  బాలల పై జరుగుతున్న లైగింక వేధింపుల , అనాధ పిల్లల,  అక్రమ రవాణా బాల కార్మికుల  పిల్లల సంరక్షణ సమస్యల గురించి  వివరించారు.ఈకార్యక్రమంలో ఎంపీడీవో శోభారాణి, జిల్లా  పరిరక్షణ విభాగం సౌజన్య , చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ లింగయ్య, ఐసిడిసి సూపర్వైజర్ ప్రమీల ,నాగారం ఎస్సై ముత్తయ్య , ఆర్. ఐ.  శాస్త్రి తది తరులు పాల్గొన్నారు.