మా దారి మార్చండి మహాప్రభో

Submitted by Srikanthgali on Tue, 11/10/2022 - 15:27
Change our path Mahaprabho

మా దారి మార్చండి మహాప్రభో

కొత్తగూడెం క్రైమ్, అక్టోబర్ 11, ప్రజాజ్యోతి:

కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధి లోని పాత కొత్తగూడెం ఏరియా లోని ప్రజలు రహదారి నిర్మాణం చేయాలనీ మున్సిపల్ అధికారులను వేడుకుంటున్నారు. గత నెలలో భారీ వాహనాల రాకపోకలు ఆగిపోవడం తో వాటివలన ఏర్పడిన గుంతలు భయాందోళనలకు గురించేస్తున్నాయి అని అక్కడి స్థానికులు అంటున్నారు. సాయంత్రం ఏడు దాటితే బైటికి రాలేక ఇబ్బంది పడుతున్నాం అని గడిచిన రెండు రోజులుగా కుండపోతగా కురుస్తున్న వర్షాలకు గుంతలు నీటితో నిండిపోయి ఉన్నాయని అవి ఎక్కడ వున్నాయి అర్ధం కాక వాహనాలు నడపడం లేదని అత్యవసర అయితే తప్ప బైటికి వెళ్లడం లేదని అంటున్నారు. రహదారి మార్గం పూర్తిగా బీటలు వారి మరి కొన్ని చోట్ల సి సి రోడ్లకు వేసిన ఇనుప కడ్డీలు బైటికి వచ్చి ప్రమాద భరింతంగా ఉన్నాయని త్వరితగతిన వాటి నిర్మాణం చేపట్టాలని ఏరియా ప్రజలు అంటున్నారు. రోజు వందల సంఖ్యలో వాహనాలు రవాణా జరుగుతున్న అధికారులు చూసి చూడనట్టు వ్యవహారిస్తున్నారని పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వార్డ్ కౌన్సిలర్ మున్సిపాలిటీ అధికారులకు ఈ విషయం పై అనేకసార్లు దరఖాస్తు చేసారని, అదే విధంగా స్థానికం గా వున్నా కొత్తగూడెం ఎం ఎల్ ఏ వనమా వెంకటేశ్వరావు కి, జిల్లా కలెక్టర్ కి కూడా వినతి పత్రం అందించాం అని వినతి పత్రాలు తీసుకోవడం తప్ప నిర్మాణం పనులు జరగడం లేదని వెంటనే రహదారి పనులను చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.