చేతి ముద్రలను ఉపయోగించి శక్తిని పొందవచ్చా?..

Submitted by Degala Veladri on Wed, 14/09/2022 - 00:03

చేతి ముద్రలను ఉపయోగించి శక్తిని పొందవచ్చా?..

 

ప్రజాజ్యోతి, సెప్టెంబరు 13, ఆరోగ్యా చిట్కాలు:

ధ్యానం, యోగా మనపై చూపే సానుకూల ప్రభావాల గురించి మనలో చాలా మందికి బాగా తెలుసు, కానీ మనం చేతి వేళ్ళోతో పెట్టే ముద్రలు చూపే ప్రభావం గురించి మాత్రం మనలో చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఈ ముద్రల శక్తి ప్రవాహం శరీరంలో అంతా చేరి అనిర్వచనీయమైన స్థితికి తీసుకెళ్తాయి. 

ప్రకృతి పంచభూతాల కలయిక ఎలాగైతే అంటారో శరీరంలో కూడా పంచభూతాల కారకాలు ఉంటాయి. వాటిని ముద్రలు ద్వారా నియంత్రించుకోవచ్చు. దీనివల్ల శరీరం సమతుల స్థితిలో ఏర్పడుతుంది. శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ యోగ, ధాన్యంలో 100 కంటే ఎక్కువ ముద్రలు ఉన్నాయంటే ఆశ్చర్యం కలుగుతుంది. అయితే ముద్రలతో ధ్యానం చేయడం వల్ల జీవితాల్లోకి సానుకూల శక్తిని ఆకర్షిస్తుందట. ఈ ముద్రల గురించి తెలుసుకుందాం. 

 

వరద ముద్ర:

చుట్టూ సానుకూల శక్తిని వ్యాప్తి చేయాలనుకుంటే, ఈ ముద్రను ప్రయత్నించండి. ఇది శరీరాన్ని శాంతింపజేస్తుంది అలాగే శరీరం, మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. 

ఎలా చేయాలి: రెండు చేతులను, అరచేతులను రెండు తొడలపైకి ఎదురుగా ఉంచి. ఊపిరిని లోపలికి పీల్చుకోండి.

సమాధి ముద్ర:

దీనిని ధ్యాన ముద్ర అని కూడా పిలుస్తారు.ఒత్తిడిని ఎదుర్కొన్నప్పుడు దృష్టి, శ్రద్ధ స్థాయిలను సమర్థవంతంగా నిర్వహించడంలో ఇది సహాయపడుతుంది.

ఎలా చేయాలి: రెండు చేతులను ఒడిలో ఉంచి, అర చేతులను పైకి లేపి, రెండు బొటనవేళ్లను కొద్దిగా తాకాలి.

జ్ఞాన ముద్ర:

ఏకాగ్రతలో సమస్య ఉందా? అయితే ఈ ముద్ర మీ జ్ఞాపకశక్తిని పెంచుతుంది.

ఎలా చేయాలి: బొటనవేలు, చూపుడు వేలును వృత్తాన్ని సృష్టించే విధంగా పెట్టండి, మిగిలిన వేళ్లను విశ్రాంతి స్థితిలో ఉంచండి.

వరుణ ముద్ర:

జీర్ణ సమస్యలున్నవారిలో, ఈ చేతి ముద్ర సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

ఎలా చేయాలి: గరిష్ట శక్తిని సంగ్రహించడానికి బొటనవేలు చిటికెన వేలును కలిపి నొక్కి ఉంచాలి.

జ్ఞాన ముద్ర:

జ్ఞాన ముద్ర అనేది చురుకుదనాన్ని పెంచడానికి మనలో చైతన్యాన్ని పెంపొందించడానికి సాధన చేసే సరళమైన వాటిలో ఒకటి.

ఎలా చేయాలి: బొటనవేలు, చూపుడు వేలును కలిపి, మిగిలిన వేళ్లను నిటారుగా, విశ్రాంతిగా ఉంచాలి.

అపాన ముద్రకాస్త ఇబ్బందికరమైన జీర్ణవ్యవస్థ ఉన్నట్లయితే వారిలో ఈ ముద్ర చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ముద్ర పొత్తికడుపులోని శక్తి చక్రాలను సమతుల్యం చేయడానికి, కడుపులోని విషాన్ని తొలగించడానికి సహాయపడుతుంది.

ఎలా చేయాలి: మిగిలిన రెండు వేళ్లను రిలాక్స్‌గా ఉంచుతూ బొటనవేలి కొనను మధ్య ఉంగరపు వేలికి తాకించండి. కాసేపు చేతిని విశ్రాంతి స్థితిలో ఉంచండి.

శుని ముద్ర:

ఈ ముద్ర శరీరంలోని ప్రతికూల శక్తిని తగ్గించడంలో సహాయపడుతుంది. సానుకూల ఆలోచనలు రావడానికి మెదడును చల్లబరుస్తుంది. 

ఎలా చేయాలి: బొటనవేలు, మధ్య వేలిని ఒకదానితో ఒకటి కలపండి.