తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ

Submitted by kareem Md on Sun, 25/09/2022 - 11:36
Bathukamma is a symbol of Telangana culture


ఫోటో రైటప్: 1)బతుకమ్మను అలంకరిస్తున్న ఉపాధ్యాయుని విద్యార్థులు.
2) బతుకమ్మ ఆడుతున్న విద్యార్థులు.
3 మోదాల రవీందర్
4. నామిరెడ్డి మంజుల
5. అవని చతుర్వేది

హలియా,సెప్టెంబర్24 ప్రజా జ్యోతి:బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాడే పాటలు మొదలుకొనిఒక్కేసి పువ్వేసి చందమామ ఒక్క జాములాయే చందమామ,రెండేసి పువ్వేసి చందమామ రెండు జాములాయే చందమామ, చిత్తూ చిత్తూల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ అంటూ పాటలు పాడుకుంటూ రంగురంగుల పూలతో పేర్చి అలంకరించిన బతుకమ్మ చుట్టు చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ బతుకమ్మ పండుగను ముందస్తుగా నిర్వహించారు. సోమవారం నుంచి తెలంగాణ ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించడంతో ముందస్తుగా శనివారం హలియా పట్టణంలోని ఆకాంక్ష,టైమ్స్, హాలియా పబ్లిక్ స్కూల్,లక్ష్య, అక్షయ పాఠశాలల లో విద్యార్ధినిలు తెలంగాణ సాంప్రదాయ పద్ధతి ఉట్టిపడే విధంగా రంగురంగుల దుస్తులు ధరించి ఘనంగా జరుపుకున్నారు.బతుకమ్మ పండుగ సందర్భంగా ఆకాంక్ష ఉన్నత పాఠశాల విద్యార్దినులు ఉదయం నుంచే రంగురంగుల పూలతో బతుకమ్మలు అలంకరించడం మొదలుపెట్టారు.అలంకరించిన గౌరీ దేవికి పూజలు నిర్వహించి ముందస్తుగా సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా ఆకాంక్ష ఉన్నత పాఠశాల కరస్పాండెంట్ మేడే పల్లి మోహన్ రావు బతుకమ్మ ఉత్సవాలను పురస్కరించుకొని విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి బతుకమ్మ పండుగ ప్రతీక అన్నారు. బతుకమ్మ పండుగ ప్రకృతిని ఆరాధిస్తూ జరుపుకునే పండుగ,బతుకమ్మ రంగురంగుల పూలను గౌరమ్మగా భావించి ఆరాధించే పండుగ తెలిపారు.

విద్యతోపాటు సాంప్రదాయం
(మొదాల రవిందర్ ఆకాంక్ష) ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్ పాఠశాలలో విద్యతోపాటు విద్యార్థులకు సంస్కృతి సాంప్రదాయం ల పట్ల అవగాహన కలిగించినట్లయితే నేటి తరానికి అవసరం తెలిపారు.భారతదేశం సర్వమతాలకు నిలయం కావున పాఠశాలలో విద్యనభ్యసించే విద్యార్థులకు సమాజంలో జరుపుకునే పండుగల పట్ల వాటి ప్రాముఖ్యతను తెలియజేయాలన్నారు. 
ప్రకృతిని ఆరాధించే పండుగ బతుకమ్మ
నామిరెడ్డి మంజుల (ఫిజిక్స్ ఉపాధ్యాయురాలు)

ప్రకృతిలో సహజంగా లభించే రంగురంగుల పూలతో బతుకమ్మ పండుగను నిర్వహించుకోవడం ఎంతో ఆనందదాయకమన్నారు.ఈ సంవత్సరం పాఠశాలలకు సోమవారం నుంచి సెలవులు ప్రకటించడంతో చివరి రోజు విద్యార్థినులతో కలిసి బతుకమ్మను తయారు చేయడం ఎంతో అనుభూతి కలిగిందన్నారు.
ఉత్సాహాన్ని కలిగించింది
అవని చతుర్వేది (ఏడవ తరగతి) కరోనా తరువాత తోటి స్నేహితులతో కలిసి రంగురంగుల పూలు రెండు రోజుల నుంచి సమకూర్చుకొని ఉదయం నుంచి పాఠశాలలో ఉపాధ్యాయులు స్నేహితులతో కలిసి రంగురంగుల బతుకమ్మ ను అలంకరించడం ఆనందాన్ని ఇచ్చిందని తెలియజేసింది.  పాఠశాలలలో సంస్కృతి సాంప్రదాయ పండుగలు నిర్వహించినట్లయితే విద్యార్థులకు పండుగ పట్ల అవగాహన కల్లుతుందని తెలియజేసింది.