ప్రొఫెసర్ జయశంకర్ కాలనీలో భక్తిశ్రద్ధలతో భజనలతో గణనాథుని నిమజ్జనం

Submitted by sridhar on Tue, 06/09/2022 - 15:04
Immersion of Lord Ganesh with devotional hymns at Professor Jayashankar Colony
  • వినాయకుని లడ్డూ వేలం పాటలో 1,03,456 రూపాయలకు లడ్డు దక్కించుకున్న సామి రాజగోపాల్

మహబూబ్నగర్, సెప్టెంబర్ 6 ( ప్రజా జ్యోతి న్యూస్) : జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్, ప్రొఫెసర్ జయశంకర్ కాలనీ యందు విఘ్నేశ్వరుని ప్రతిష్టించడానికి ఏర్పాటు చేసిన మండపాన్ని రంగు రంగు పూలతో , మామిడి తోరణాలతో విద్యుత్ దీపాలతో  ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా అలంకరించి గత ఐదు రోజులుగా మండపంలో ప్రతిష్టించిన వినాయకుడికి పూజలు చేస్తూ, భక్తిశ్రద్ధలతో భజనలు చేస్తూ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ, సోమవారం రోజు వినాయకుడి నిమజ్జన కార్యక్రమంలో భాగంగా  లడ్డూ వేలంపాట నిర్వహించడం జరిగింది.

ఈ వేలం పాటలో ఎంతోమంది భాగస్వాములై తమ అదృష్టాన్ని పరీక్షించుకోగా చివరకు సామి రాజగోపాల్ 1,03,456 రూపాయలకు వేలంపాటలో లడ్డూను దక్కించుకోవడం జరిగింది. గత సంవత్సరం లడ్డూను దక్కించుకున్న వారికి, ఈ సంవత్సరం వేలంపాటలో లడ్డు పొందిన రాజగోపాల్ కి జయశంకర్ కాలనీ వాసులు శాలువాతో సన్మానించడం జరిగింది. అనంతరం కాలనీవసూలు, చిన్నారులు వినాయకుని నిమజ్జనాన్ని పురస్కరించుకొని కాషాయపు, పసుపు వస్త్రాలు ధరించి భక్తిశ్రద్ధలతో భజనలు చేస్తూ వినాయకుడిని  ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు రవీందర్ గౌడ్, కార్యదర్శి విజయ మోహన్, సభ్యులు బి చిన్న యాదయ్య, రాజశేఖర్ గౌడ్, వెంకటేష్, సంపత్, సత్యనారాయణ, శ్రీనివాస్ రెడ్డి, వెంకట సాయి 4వ వార్డ్ మాజీ కౌన్సిలర్ శివశంకర్, భానుచందర్, ముయ్యలి నర్సింలు తదితరులు పాల్గొన్నారు.