పూర్తయిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వకపోతే ప్రభుత్వం భూములను ఆక్రమిస్తాం

Submitted by Sathish Kammampati on Sat, 24/09/2022 - 11:43
If the completed double bedroom houses are not provided, the government will encroach on the land


కలెక్టరేట్ ముందు ధర్నా చేసిన ప్రజాసంఘాల నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట నాయకుల అరెస్ట్,విడుదల

మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి హెచ్చరిక
నల్లగొండ సెప్టెంబర్ 23(ప్రజాజ్యోతి)ప్రతినిధి:  
రాష్ట్ర ప్రభుత్వం ఇంటి స్థలం లేని పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని, ఇవ్వకపోతే మేమే ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తామని మాజీ శాసనసభ్యులు ప్రజాసంఘాల ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు జూలకంటి రంగారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.శుక్రవారం నాడు ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. ఈ ధర్నాన్ని ఉద్దేశించి రాష్ట్ర నాయకులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు చాలా గ్రామాలలో పేదలకు ఇండ్ల స్థలాల కోసం ప్రభుత్వం భూమి సేకరించిందని, అట్టి భూమిలో కొంతమంది లబ్ధిదారులకు స్థలాలు ఇచ్చారని గుర్తు చేశారు.ఆ స్థలాలలో రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రకృతి వనాలు,స్మశానవాటికలు,క్రీడ మైదానాలు కట్టడం దుర్మార్గం అన్నారు. ఇవి కట్టాలంటే ప్రభుత్వం ప్రత్యేకంగా భూములను సేకరించాలని కోరారు.ప్రభుత్వం సేకరించిన భూములలో కొన్ని గ్రామాలలో పేదలకు పట్టాలు ఇచ్చినప్పటికీ వాటి స్థానంలో ఇండ్ల నిర్మాణం చేసుకోవడానికి ప్రభుత్వం ప్రకటించిన ఐదు లక్షల రూపాయల వెంటనే మంజూరు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా  ప్రకటించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లను నల్లగొండ, దేవరకొండ, మిర్యాలగూడ, బి వెల్లంల,ఔరవాణి, అన్నా రెడ్డి గూడెం మొదలగు గ్రామాలలో పూర్తయిన నేటికీ లబ్ధిదారులను గుర్తించకపోవడం దారుణమన్నారు. చాలా గ్రామాలలో పనులు ప్రారంభించినప్పటికీ సగం పనులు కూడా నిధుల లేమితో పూర్తి కాలేదు అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వాటిని చిత్తశుద్ధితో పూర్తిచేసి లబ్ధిదారులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పూర్తిచేసిన ఇండ్లను వెంటనే ఇవ్వకపోతే అర్హులైన లబ్ధిదారులను గుర్తించి మేమే పంచుతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని కోరుతూ ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరుతూ, ఇంటి స్థలాలు ఇవ్వాలని, డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని అనేకమంది పేదలు గత కొన్ని సంవత్సరాలుగా మొత్తుకుంటున్న ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు.కావున ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది.ప్రజాసంఘాల ఐక్యవేదిక జిల్లా నాయకులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో అనేక మంది పేదలు కిరాయి ఇళ్లల్లో ఉంటూ కిరాయి కట్టలేక అనేక ఇబ్బందులు పడుతున్నారని,  పేదలకు 120 గజాల చొప్పున ఇంటి స్థలాలు ఇవ్వాలని, ఇంటి స్థలం ఉన్న వారికి ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని పట్టాలు ఇవ్వాలని కోరారు.

ధరణి సమస్యలు ఎదుర్కొంటున్న రైతులు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారని, వారి సమస్యలను పరిష్కరించి వెంటనే   కొత్త పాస్ బుక్కులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ ముందు ధర్నా చేసిన ప్రజా సంఘాల నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు,ధర్నాలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతుండగా పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులకు ధర్నాకు వచ్చిన ప్రజలకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది.శాంతియుతంగా ధర్నా చేస్తున్న ప్రజాసంఘాల నాయకులను ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి తుమ్మల వీరారెడ్డి నారి ఐలయ్య పాలడుగు నాగార్జున ప్రభావతి లక్ష్మీనారాయణ మహమ్మద్ సలీం దండెంపల్లి సత్తయ్య తుమ్మల పద్మ  కొండా అనురాధ దండెం పల్లి సరోజ,భూతం అరుణ, వి వెంకటేశ్వర్లు తోపాటు పలువురు ప్రజాసంఘాల నాయకులను అరెస్ట్ చేశారు. వారిని వ్యక్తిగత పూచికత్తుపై విడుదల చేశారు.నాయకుల అరెస్టు చేయడాని సిపిఐఎం నల్లగొండ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుందని ఒక ప్రకటనలో తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, తుమ్మల వీరారెడ్డి, నారీ ఐలయ్య, పాలడుగు నాగార్జున, బండా శ్రీశైలం, కున్ రెడ్డి నాగిరెడ్డి, ప్రభావతి, సిహెచ్ లక్ష్మీనారాయణ, ఎండి సలీం,వి వెంకటేశ్వర్లు, గంజి మురళి, బొజ్జ చిన్న వెంకులు,సైదులు,దండెం పల్లి  సత్తయ్య,తుమ్మల పద్మ, కొండ అనురాధ,దండెం పల్లి సరోజ కుంభం కృష్ణా రెడ్డి, అద్దంకి నర్సింహ, తదితరులు పాల్గొన్నారు.