జర్నలిస్టుల పాదయాత్ర కు హై కోర్టు అనుమతి

Submitted by Ashok Kumar on Wed, 21/09/2022 - 18:56
High Court permission for journalists' march
  •  -- ఈ నెల 24 వ తేది వరకు పోలీస్ లు అనుమతులు ఇవ్వండి అని ఆదేశాలు జారీ . 
  • -- న్యాయవాది పూజారి శ్రీలేఖకు ధన్యవాదాలు తెలిపిన జర్నలిస్టులు.
  • -- తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్  జిల్ల అధ్యక్షులు వాకిట అశోక్ కుమార్ 
    మహబూబ్ నగర్ ప్రతినిధి ప్రజా జ్యోతి న్యూస్ సెప్టెంబర్ 21: తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జర్నలిస్టుల డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం ఈ నెల 25వ తేదీన చేయబోయే పాదయాత్ర కు ఎట్టకేలకు అత్యున్నత న్యాయస్థానం జర్నలిస్టుల పాదయాత్రకు అనుమతించిందనీ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు వాకిటా అశోక్ కుమార్ తెలిపారు. బుధవారం ఆర్ అండ్ బి  అతిథి గృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మహబూబ్నగర్ జిల్లా ఆధ్వర్యంలో జర్నలిస్టుల కు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల  సాధన కోసం పాలమూరు నుండి ప్రగతి భవన్ వరకు పాదయాత్ర చేయుటకు డిజిపి,ఎస్పిలు, పోలీస్ కమిషనర్, సైబరాబాద్ కమిషనర, కలెక్టర్లకు శాంతియుత పాదయాత్ర కొరకు అనుమతి కోరాము అని , అలాగే ముఖ్యమంత్రి గారిని అపాయింట్మెంట్ ఇవ్వమని వేడుకున్నారు. ఈ విషయంలో పోలీసుల నుండి ఎటువంటి సమాచారం రాకపోవడంతో ఈనెల 20వ తేదీన హైకోర్టును ఆశ్రయించామని తెలిపారు. హైకోర్టులో న్యాయవాది పూజారి  శ్రీలేఖ జర్నలిస్టుల సంక్షేమం కోసం వాళ్ళు చేస్తున్న శాంతియుత పాదయాత్రకు అనుమతివ్వాలని అత్యున్నత న్యాయస్థానం ను కోరారు. ఎట్టకేలకు అత్యున్నత న్యాయస్థానం జర్నలిస్టులు శాంతియుత పాదయాత్ర చేసుకొనుటకు 24 వరకు పోలీసులకు పర్మిషన్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారని అన్నారు .లేని పక్షంలో ఈ నెల 25 వ తేది నుండి  నుండి 30 పాదయాత్ర చేయుటకు   గౌరవ హైకోర్టు అనుమతులు ఇచ్చారనీ ఆయన అన్నారు

మహబూబ్నగర్ నియోజకవర్గంలో ఉన్న జర్నలిస్టులు అందరూ పాదయాత్రలో పాల్గొనాలని , తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున మేము కార్యక్రమం చేపట్టిన మీరందరూ కలిసి వస్తే జర్నలిస్ట్ జేఏసీగా ముందుకు పోదామని ఆయన తెలిపారు . తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ గా  మాకు పేరకోసం ఏమి చేయడం లేదని జర్నలిస్టుల సంక్షేమం కోసం  అందరూ కలిసి వస్తే జేఏసీగా మందు పోదామని ఆయన అన్నారు .   ఈరోజు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ అందరి జర్నలిస్టుల సంక్షేమం కోసమే ఈ పాదయాత్ర చేపట్టినట్లు ఆయన వివరించారు. గతంలో కాంగ్రెస్ హయాంలో  డీకే అరుణ మంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన ప్లాట్ల పట్టాలను తెలంగాణ ప్రభుత్వం వాపస్ తీసుకొని ఇండ్లు నిర్మించి ఇస్తామని కాలయాపన చేస్తుందని ఆయన పేర్కొన్నారు. గత మూడు సంవత్సరాలుగా నిర్మాణం పూర్తి చేసి ఇస్తాము ఇస్తామంటూ కాలయాపన  జరుగుతుందని ఆయన అన్నారు. క్రిస్టియన్ పల్లి 523 సర్వే నెంబర్ల లో పట్టాలు వాపస్ తీసుకున్న జర్నలిస్టులకు  దివిటీ పల్లి లో నిర్మించిన ఇండ్లు ఇస్తామని తాసిల్దార్ కార్యాలయంలో లిస్టు వేసి ఇయ్యలేదని ఆయన గుర్తు చేశారు. 25 సర్వేనెంబర్ ఎస్వీఎస్ దగ్గర కూడా ఇదేవిధంగా జరగవచ్చని అందరు జర్నలిస్టులు అంతర్మదనం గురవుతున్నారని, కొంతమంది భయంతో ముందుకు రాలేకపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం మంత్రిగారు అనుకుంటే కేవలం రెండు నెలల్లోనే డబల్ బెడ్ ఇండ్లు పూర్తి అవుతాయని ఆయన గుర్తు చేశారు. ఎస్వీఎస్ దగ్గర డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం ప్రారంభించి మూడు సంవత్సరాల ఆయన పూర్తి కావడం లేదని అన్నారు. ఎస్ ఎస్ తర్వాత శంకుస్థాపనలు చేసిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తయ్యాయని, కలెక్టర్ కార్యాలయం పూర్తయిందని, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పూర్తి అయిందని ఆయన  అన్నారు.  ముఖ్యమంత్రి  గారు, మంత్రి గారు  తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని చెప్పి డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పి న  మాట వాగ్దానాలనే అడుగుతున్నామని మావి కొత్త కోరికలు ఏమి కోరడం లేదని ఆయన గుర్తు చేశారు.  మేము తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జర్నలిస్టుల ము  శాంతియుతంగానే పాదయాత్ర నిర్వహిస్తామని ఈ నెల 25వ తేదీ ఆదివారం 11 గంటలకు మహబూబ్ నగర్ అంబేద్కర్ చౌరస్తా నుండి ప్రారంభించి 30వ తేదీ ప్రగతి భవన్ చేరుకొని ముఖ్యమంత్రి కి నివేదిక ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. కోర్టు ఇచ్చిన డైరెక్షన్లోనే నియమ నిబంధనలు పాటిస్తూ ఎవ్వరికి ఆటంకం కలగకుండా పాదయాత్ర నిర్వహిస్తామని ఆయన అన్నారు.

  • ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డాక్టర్ బండి విజయ్ కుమార్. ఎలక్ట్రానిక్ మీడియా కార్యదర్శి మెట్టు కాడి ప్రభాకర్, మహమ్మద్ కలీమ్ , జక్కగోపాల్ తదితరులు పాల్గొన్నారు.