ఘనంగా లక్ష్మణ్ బాపూజి వర్ధంతి

Submitted by veerareddy on Thu, 22/09/2022 - 12:03
Happy birthday to Laxman Bapuji

జాతీయ చేనేత ఐక్యవేదిక ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ  

భూపాలపల్లి టౌన్ సెప్టెంబర్21 ప్రజాజ్యోతి.  కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా బుధవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మానసిక వికలాం గుల పాఠశాల హెచ్ఎంఆర్డీఎస్ విద్యార్థులకు జాతీయ చేనేత ఐక్యవేదిక ఆధ్వర్యంలో నాయకులు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జాతీయ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు భీమనాధుని సత్యనారాయణ, రాష్ట్ర యూత్ కోశాధికారి కూచన కిషన్ ప్రసాద్ లు మాట్లాడుతూ ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు మాజీ మంత్రివర్యులు కొండా లక్ష్మణ్ బాపూజీ 1969లో మొదలైన తెలంగాణ తొలి దశ ఉద్యమానికి మద్దతుగా తన మంత్రి పదవికి రాజీనామా చేశారని గుర్తు చేశారు. ఉద్యమానికి ముందు నిలచి మలిదశ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి తన ఇల్లు జల దృశ్యానికి వేదికగా ఇచ్చారని, ఇవ్వడమే కాకుండా మలిదశ  ఉద్యమంలో ముందుండి పోరాటం చేసిన మహానుభావుడని అన్నారు. లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని హైదరాబాద్ ట్యాంక్ బండుపై ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. బడుగు బలహీన వర్గాల ఐక్యత కోసం చేనేత, ఇతర సహకార సంఘాల పుట్టుకకు పునాది వేసిన మహానుభావుడు బాపూజీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు దుబాస్ రాజయ్య, రాజశేఖర్, దాసరి సుదర్శన్, చీకటి తిరుపతి తదితరులు పాల్గొన్నారు