రామప్పలో చేనేత వస్త్ర ప్రదర్శన స్టాల్స్ ఏర్పాటు

Submitted by veerareddy on Mon, 03/10/2022 - 12:19
 Handloom textile display stalls set up at Ramappa

వెంకటాపూర్/ములుగు జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 02 (ప్రజా జ్యోతి): ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలో ఉన్న ప్రపంచ ప్రసిద్ధిగాంచిన రామప్ప దేవాలయ గార్డెన్లో గాంధీ జయంతిని పురస్కరించుకొని కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఆదివారం చేనేత వస్త్ర ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది.సేవ టూరిజం అండ్ కల్చరల్ సొసైటీ ఫౌండర్ ప్రెసిడెంట్ డాక్టర్ కుసుమ సూర్యకిరణ్,జగదీష్,ప్రశాంత్ ఆధ్వర్యంలో స్టాల్స్ ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర పురావస్తు శాఖ డిఈ చంద్రకాంత్, తెలంగాణ రాష్ట్ర హ్యాండ్లూమ్స్ వీవర్స్ కో ఆపరేటివ్ సొసైటీ డివిజనల్ మేనేజర్ కృష్ణ హరి,పిఎంఈజిపి రాజేష్ నోడల్ ఆఫీసర్, ఎస్సై తాజుద్దీన్, సర్పంచ్ డోలి రజిత, పురావస్తు శాఖ జిల్లా అధికారి మల్లేష్ హాజరై స్టాల్స్ ను ప్రారంభించారు.ఏడు స్టాల్స్ ను ఏర్పాటు చేయగా ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రాం, స్వయం ఉపాధి చెందిన వారు ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి వచ్చి చేనేత వస్త్ర ప్రదర్శన చేశారు.చేనేత వేసిన వస్త్రాలను 30 నుండి 40 శాతం తక్కువ ధరకు ఈ స్టాల్స్ లో పర్యాటకులకు అమ్మడం జరిగింది.ఈ సందర్భంగా చంద్ర కాంత్ మాట్లాడుతూ ఆజాదికా అమృత్ మహోత్సవంలో బాగంగా ఈ స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో పురావస్తు శాఖ,టూరిజం శాఖ,దేవదాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.