ఏఎంసీ చైర్మన్ గుజ్జరి రాజు ఆధ్వర్యంలో ఉచిత మెగా పశు వైద్య శిబిరం

Submitted by lenin guduru on Sat, 01/10/2022 - 22:20
రాజు

ఏఎంసీ చైర్మన్ గుజ్జరి రాజు ఆధ్వర్యంలో ఉచిత మెగా పశు వైద్య శిబిరం


చిల్పూర్, అక్టోబర్01, (ప్రజాజ్యోతి):
 పశువులకు సరైన సమయంలో టీకాలు, నట్టల మందులు వేయించి పశువులు రోగాల బారిన పడకుండా కాపాడాలని స్టేషన్గన్పూర్ ఏఎంసీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుజ్జరి రాజు అన్నారు.ఈ సందర్భంగా జనగామ జిల్లా చిల్పూర్ మండలంలోని పల్లగుట్ట గ్రామంలో  శనివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ మార్కెటింగ్ శాఖ వారి సౌజన్యంతో స్టేషన్ ఘనపూర్ వ్యవసాయ  మార్కెట్ కమిటీ చైర్మన్ గుజ్జరిరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా పశు వైద్య శిబిరాన్ని చిల్పూర్ మండల ఎంపిపి బొమ్మిశెట్టి సరిత బాలరాజు,చిల్పూర్ గుట్ట శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు సంయుక్తంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొట్టు మానస, ఎంపీటీసీ జీడి ఝాన్సీ రాణి, ఉప సర్పంచ్ బత్తిని శ్రీనివాస్, పిఎసిఎస్ వైస్ చైర్మన్ చిర్ర నాగరాజు, మార్కెట్ కార్యదర్శి జీవన్ కుమార్, మార్కెట్ వైస్ చైర్మన్ చల్ల చందర్ రెడ్డి,
మార్కెట్ కమిటీ  డైరెక్టర్లు 
బత్తుల రాజన్ బాబు, శ్యాంసుందర్, రాజ్ కుమార్, హరీష్, వరుణ్, చిగురు సరిత, మండల పశు వైద్యాదికారి యం అన్వేష్, వైద్య సిబ్బంది ఫయాస్,రమేష్, సదానందం, గోపాలమిత్ర ఆయుష్ రైతులు, మార్కెట్ సిబ్బంది విజయ్, మల్లేశం, శ్రీనివాస్, షరీఫ్, రాంచందర్,కిషన్, అశోక్, ప్రవీణ్, అనిల్ తోపాటు రైతులు తదితరులు పాల్గొన్నారు.