వయో వృద్ధుల సంక్షేమమే లక్ష్యం జిల్లా సంక్షేమ అధికారి ఎం సబిత

Submitted by veerareddy on Tue, 27/09/2022 - 12:14
The goal is the welfare of the elderly    District Welfare Officer M Sabitha

హనుమకొండ, సెప్టెంబర్26 (ప్రజాజ్యోతి)../... అంతర్జాతీయ వయో వృద్దుల వారోత్సవాలలో భాగంగా సోమవారం ఫాతిమానగర్ లోని సెయింట్ ఆన్స్ వృద్ధాశ్రమంలో ఉన్న వారికి క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు మహిళలు పిల్లలు దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో  నిర్వహించడం జరిగింది.అనంతరం హనుమకొండ సిడిపివో కే మధురిమ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా సంక్షేమ అధికారి సబిత మాట్లాడుతూ వివిధ వృద్ధాశ్రమాలలో ఉన్న వారు తమకు ఎవరు లేరని, ఒంటరి వారిమనే దిగులు చెందవద్దని, వృద్దులకు చేయూత నివ్వడానికి ప్రభుత్వం అధికారులు ఉన్నారని అన్నారు. వయోవృద్ధులను వేధించడం, నిర్లక్ష్యం చేయడం అనేది గుర్తించబడిందని ఈ విషయం బయట ప్రపంచానికి చెప్పలేని సమస్యగా రూపుదాల్చిందని ఆవేదన వెలిబుచ్చారు. ఇట్టి సంఘటనలు పునరావృతం కాకుండా వయో వృద్ధుల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నామని అన్నారు,  ప్రస్తుతం ఉద్యోగ ఉపాధి, వ్యాపారాలలో తలమునకలై వృద్ధులను పట్టించుకోకపోవడం బాధాకరమైన విషయమని వయో వృద్ధుల సమస్యల పట్ల అవగాహన, మానవతా విలువలు పెంపొందించాలని, వయో వృద్ధుల పట్ల సానుభూతి తో కాకుండా సహానుభూతితో  చర్యలు అందించాలని కోరారు.వేధింపులకు గురైన వయో వృద్ధులు తగు సలహా పునరావాసం నిమిత్తం 14567 టోల్ ఫ్రీ నంబర్ల లో సంప్రదించాలని కోరారు, ఈ సందర్భంగా వయోవృద్దులకు ఆటల, పాటల పోటీలు నిర్వహించడం జరిగిందని ఇందులో గెలుపొందిన వారికి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను అక్టోబర్ 1న ప్రధానం చేస్తామని తెలిపారు. ఈకార్యక్రమంలో ప్రముఖ సంఘ సేవకురాలు, అనురాగ్ హెల్పింగ్ సొసైటీ అధ్యక్షురాలు కే అనితా రెడ్డి, సీనియర్ సిటిజన్స్ ఫోరం అధ్యక్షులు ఏ చంద్రమౌళి,కార్యదర్శి వి దేవాచారి, చంద్రకళ,వరల్డ్ పీస్ ఫెస్టివల్ సొసైటీ ఫౌండర్  మహమ్మద్ సిరాజుద్దిన్, ఆర్ రామ్మూర్తి, నంచర్ల వైకుంఠం, భూక్యా రామచంద్రం, ఐసిడిఎస్ సూపర్ వైజర్ డి రాజ్యలక్ష్మి,ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎస్ ప్రవీణ్ కుమార్, ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫిసర్ కే జయధర్, జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం నుండి పి రేవంత్, డీవీ ఆక్ట్ కౌన్సిలర్ పావని, సెయింట్ ఆన్స్ ఆశ్రమం నిర్వాహకులు సిస్టర్ సోఫియా తదితరులు పాల్గొన్నారు.