స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి.

Submitted by Praneeth Kumar on Sun, 11/09/2022 - 17:56
Garlanded to the statue of Swami Vivekananda.

ఖమ్మం అర్బన్, సెప్టెంబర్ 11, ప్రజాజ్యోతి.

భారతీయ సనాతన ధర్మాన్ని ప్రపంచవ్యాప్తం చేసిన స్వామి వివేకానంద చికాగో ఉపన్యాసం 129వ వార్షికోత్సవం సందర్భంగా వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్లెన్స్ ఆధ్వర్యంలో ఖమ్మంలోని ఇల్లందు క్రాస్ రోడ్ వద్ద స్వామి వివేకనంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఖమ్మం భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఇంచార్జ్, విఐహెచ్ఈ ఫౌండర్ దేవికి వాసుదేవ మాట్లాడుతూ స్వామి వివేకానంద చికాగోలో జరిగిన మత సమ్మేళనాన్ని గురించి వివరించారు. ఈ సమ్మేళనం ద్వారా భారతీయ సనాతన ధర్మం స్వామి వివేకానంద విశ్వవ్యాప్తం చేశారని గుర్తు చేశారు. అందరూ స్వామి వివేకానంద ను ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని తెలిపారు. వివేకానంద ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని యువతకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి శీలం పాపా రావు, అంకటి పాప రావు, అంజయ్య, వేల్పుల సుధాకర్, గన్నవరపు చంద్ర శేఖర్, జై పటేల్, ప్రవీణ్ పటేల్  హాజరయ్యారు.