బతుకమ్మ విగ్రహ నిర్మాణ పనులు అడ్డుకున్న ఫారెస్ట్ అధికారులను విధుల నుండి తొలగించాలి.

Submitted by veerareddy on Tue, 20/09/2022 - 16:46
The forest officials who obstructed the construction of Bathukamma statue should be removed from duty.

బీజేపీ గిరిజన మోర్చా వనభందు సెల్ రాష్ట్ర కన్వీనర్ బోడ, నవీన్ నాయక్.

కొత్తగూడ సెప్టెంబర్ 20 (ప్రజా జ్యోతి)  మండలంలోని వెలుబెల్లి గ్రామ పంచాయతీలో గ్రామ ప్రజలు, గ్రామ పంచాయతీ పాలక వర్గం నిర్ణయం మేరకు వెలుబెల్లి పెద్ద చెరువు కట్టపై చేపడుతున్న బతుకమ్మ విగ్రహ నిర్మాణ పనులు అడ్డుకున్న ఫారెస్ట్ అధికారులపై చర్యలు.     తీసుకొని వారిని విధుల నుండి తొలగించాలని బీజేపీ గిరిజన మోర్చా వనభందు సెల్ రాష్ట్ర కన్వీనర్ బోడ నవీన్ నాయక్ డిమాండ్ చేశారు. మండల కేంద్రం లో బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సందర్బంగా బీజేపీ గిరిజన మోర్చా వనభందు సెల్ రాష్ట్ర కన్వీనర్ బోడ నవీన్ నాయక్ మాట్లాడుతు తెలంగాణ రాష్ట్ర పండుగగా ప్రతి సంవత్సరం నిర్వహించే బతుకమ్మ పండుగ ను వెలుబెల్లి ప్రజల కోరిక మేరకు గ్రామ పంచాయతీ పాలక వర్గం బతుకమ్మ విగ్రహ ఏర్పాటు పనులు చేస్తుంటే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మక్బుల్ మరియు బీట్ ఆఫీసర్ పుష్పలత గ్రామస్తులతో    వాగ్వాదానికి దిగి వారిని కులం పేరుతో దుషించారని,ప్రభుత్వం బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చిన కూడ కావాలనే ఈ అటవీ శాఖ అధికారులు స్థానికులపై దురుసుగా ప్రవర్తించి బతుకమ్మ ఉత్సవాలపై గ్రామస్తుల మనోభావాలు దెబ్బ తినేలా మాట్లాడారని కావున ఈ సంఘటనకు చర్యగా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మక్బుల్, బిట్ ఆఫీసర్ పుష్పలత సస్పెండ్ చేసి శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని, బతుకమ్మ విగ్రహ నిర్మాణ పనులకు ఆటంకం కల్పించవద్దని లేని యెడల గ్రామస్తులతో కలిసి ఫారెస్ట్ మండల కార్యాలయానికి ముట్టడిస్తామని హేచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు వాసంమునిందర్, ప్రధాన కార్యదర్శులు యాదగిరి,
మురళి, తోటకూరి మధు, జిల్లా కార్యదర్శి భూపతి ,తిరుపతి,సీనియర్ నాయకులు ఈసం నరేష్, వజ్జ రవి, మోకాళ్ళ శివ కుమార్, కొట్టె  శ్రీను, తుపాకుల పరుశరామ్, సిరబోయిన యాకయ్య, తదితరులు పాల్గొన్నారు.