అక్టోబర్ 1న ఫుడ్ లైసెన్స్ మేళ

Submitted by Sathish Kammampati on Sat, 01/10/2022 - 10:31
Food license on October 1

నల్లగొండ సెప్టెంబర్ 30(ప్రజాజ్యోతి)/...జిల్లాలో అక్టోబర్ 1న నిర్వహించే ఫుడ్ లైసెన్స్ మేళ ను ఉమ్మడి నల్గొండ జిల్లా చిన్న,పెద్ద వ్యాపారస్తులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ స్వాతి కృష్ణమూర్తి లు ఒక ప్రకటనలో తెలిపారు.ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాల అనుసారం అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్  వి జ్యోతిర్మయి ఆధ్వర్యంలో ఈ లైసెన్స్ మేలాను నల్లగొండ పట్టణంలోని గాంధీ పార్క్ వద్ద ఉన్న వాసవి భవనం లో నిర్వహించడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమాన్ని  కిరాణా ,జనరల్ స్టోర్స్, సూపర్ మార్కెట్స్, డాబాలు హోటల్స్ రెస్టారెంట్స్, టిఫిన్ సెంటర్స్, బేకరీలు, స్వీట్ షాపులు, ఆహార తోపుడు బండ్లు, చిన్న,పెద్ద  ఆహార వ్యాపారం చేసేటటువంటి వ్యాపారదారులు రిజిస్ట్రేషన్ చేసుకుని వెంటనే లైసెన్స్ పొందాలని  తెలిపారు.వ్యాపారుని యొక్క ఆధార్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటో మరియు షాపు యొక్క కరెంట్ బిల్ వెంట తెచ్చుకోవాలని సూచించారు. లైసెన్సు లేనియెడల ఐదు లక్షల జరిమానా ,ఆరు నెలల జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ఉమ్మడి జిల్లా వ్యాపారస్తులు సద్విని చేసుకోవాలని కోరారు.