ట్రాఫిక్ నిబంధనలు పాటించండి లేదంటే జరిమానా తప్పడు వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి

Submitted by veerareddy on Thu, 22/09/2022 - 12:07
Follow the traffic rules or you will be fined  Warangal Police Commissioner Dr. Tarun Joshi

హనుమకొండ, సెప్టెంబర్21 (ప్రజాజ్యోతి).../ వాహనదారులు తప్పని సరిగా ట్రాఫిక్ నిబంధనలను పాటించాల్సి వుంటుందని లేదంటే ట్రాఫిక్ జరిమానా నోటీస్ మీ ఇంటి తలుపు తడుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ వాహనదారులకు సూచించారు. ట్రై సిటి పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు, ట్రాఫిక్ క్రమబద్దీరణ చేస్తున్న పోలీసులకు తమ వంతు సహకారం అందించడం కోసం హనుమకొండలోని ఆజర హస్పటల్ యాజమాన్యం బుధవారం  వరంగల్ పోలీస్ కమిషనర్‌ కు  మూడు ఫోటో కెమెరాలను  అందజేసారు. ఈ సందర్భంగా తమ వంతు బాధ్యతగా ట్రాఫిక్ నియంత్రణ కోసం ట్రాఫిక్ అవసరమయిన ఫోటో కెమెరాలను అందజేసినందుకుగాను పోలీస్ కమిషనర్ ముందుగా ఆజరహస్పటల్ యాజమాన్యాన్ని అభినందించారు. అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ కేవలం వాహనదారులకు జరిమానాలు విధించడం పోలీసుల లక్ష్యం కాదని ప్రతి వాహనదారుడు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవడమే ట్రాఫిక్ పోలీసుల ప్రధాన లక్ష్యమని, ట్రాఫిక్ నిబంధనలను ప్రతి వాహనదారుడు తప్పక పాటించాలని, అలాగే నిబంధనలు పాటించని వాహనదారులకు జరిమానాలు తప్పవని, రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ నియంత్రణకు ప్రజల సహకారం అవసరమని పోలీస్ కమిషనర్ తెలియజేసారు. ఈ కార్యక్రమములో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ అదనపు డిసిపి పుష్పా రెడ్డి, ట్రాఫిక్ ఎసిపి మధుసూదన్ రెడ్డి, హనుమకొండ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ రవికుమార్, డాక్టర్ శివసుబ్రమణ్యం, డా. వెంకటేష్ తౌటి పాల్గొన్నారు.