ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఆదర్శాలు,ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

Submitted by Sathish Kammampati on Tue, 27/09/2022 - 16:25
Everyone should strive to achieve the ideals and aspirations of Acharya Konda Laxman Bapuji
  • కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితకాలమంతా పోరాటాలే 
  • రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
  • జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరం లో కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి సందర్భంగా రాష్ట్ర శాసన మండలి చైర్మన్, జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి ,ప్రజా ప్రతినిధులు అధికారుల ఘన నివాళి


నల్లగొండ సెప్టెంబర్ 27(ప్రజాజ్యోతి)ప్రతినిధి:తెలంగాణ స్వరాష్ట్ర సాధనకు విశేష కృషి చేసిన ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఆదర్శాలు, ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.మంగళ వారం ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ 107 వ జయంతిని పురస్కరించుకొని
జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరం లో రాష్ట్ర శాసన మండలి చైర్మన్,జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి,జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రేగట్టే మల్లికార్జున రెడ్డి,అదనపు కలెక్టర్ లు రాహుల్ శర్మ,భాస్కర్ రావు,జడ్.పి.వైస్.చైర్మన్ ఇరిగి పెద్దులు కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం,రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని దారబోసిన మహనీయుడు కొండా లక్ష్మణ్‌బాపూజీ అని కొనియాడారు. బాపూజీ జీవితకాలమంతా పోరాటాలతోనే సాగిందని పేర్కొన్నారు.స్వాతంత్ర్య పోరాటం లో,నిజాం,రజాకార్ల ఆగడాలకు వ్యతిరేకంగా,తెలంగాణ తొలి,మలి దశ ఉద్యమం లలో పాల్గొని స్వాతంత్ర్య సమరయోధునిగా,రాజకీయ వేత్తగా రాష్ట్ర,దేశ ప్రజలకు నిస్వార్థంగా సేవలు అందించారని అన్నారు. తెలంగాణ జెండాను ఎత్తిన తొలి తరం నేతగా ఖ్యాతిగడించారని అన్నారు.కొండా లక్ష్మణ్ బాపూజీ 1915 సెప్టెంబర్ 27 న కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిండి కుగ్రామం లో జన్మించి నప్పటికీ,ఆయన నల్గొండ వాసిగా గుర్తింపు పొందారని అన్నారు.బాపూజీ 1952 అదిలా బాద్ జిల్లా అసిఫా బాద్ నుండి తొలి సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర శాసన సభకు ఎన్నికయ్యారు.

1957 లో జరిగిన రెండవ సార్వత్రిక ఎన్నికల్లో నల్గొండ జిల్లా చిన్న కోడూర్ నుండి ఎన్నికయ్యారని తెలిపారు.ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజలకు ఎనలేని సేవలందించారని తెలిపారు.తెలంగాణ కోసం 1969 లో మంత్రి పదవిని త్యాగం చేశారని చెప్పారు. పదవుల కోసం ఆయన ఎప్పుడు పాకులాడలేదని, నిస్వార్థంగా తెలంగాణ కోసం నిరంతరం ఉద్యమించారని వివరించారు. 97 ఏళ్ళ వయసులోనూ యువకుడి మాదిరిగా తెలంగాణ పోరాటంలో పాల్గొన్నారని అన్నారు.ఆచార్య కొండా లక్ష్మణ్‌బాపూజీ జీవిత చరిత్ర భావి తరాలకు స్ఫూర్తిదాయకమని చెప్పారు.ఉద్యాన వర్సిటీ కి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు ను రాష్ట్ర ప్రభుత్వం పెట్టడం జరిగిందని అన్నారు.ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని,సమస్యలు లేని గ్రామాలు,మండలం లు,జిల్లా,రాష్ట్రం గా రూపొందించుటకు,రాష్ట్ర అభివృద్ధి కి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపు నిచ్చారు.ఈకార్యక్రమంలో బి.సి.అభివృద్ది అధికారిని పుష్ప లత,రిటైర్డ్ ఐ. ఏ.ఎస్. అధికారి చో ల్లేటి ప్రభాకర్,ఎం.బి.సి.నాయకులు కొండూరు సత్య నారాయణ,టి.యన్.జి. ఓ అధ్యక్షులు శ్రావణ్ కుమార్,బి.సి.సంఘాల నాయకులు,పలువురు అధికారులు పాల్గొన్నారు.