రోజులు మారినా గిరిజనుల బతుకులు మారలేదు

Submitted by veerareddy on Tue, 27/09/2022 - 12:18
Even though the days have changed, the lives of the tribals have not changed

అంబేద్కర్ యువజన సంఘం గూడూరు మండల అధ్యక్షుడు సింగుడాల వీరస్వామి

మహబూబాబాద్ బ్యూరో   సెప్టెంబర్ 26 (ప్రజా జ్యోతి): రోజులు మారినా గిరిజన ప్రాంతంలో నివసించే ప్రజల బ్రతుకులు మారలేదని అంబేద్కర్ యువజన సంఘం గూడూరు మండల అధ్యక్షుడు సింగుడాల వీరస్వామి అన్నారు. సోమవారం  గూడూరు మండల కేంద్రంలో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సమావేశానికి అంబేద్కర్ యువజన సంఘం గూడూరు మండల అధ్యక్షుడు సింగుడాల వీరస్వామి పాల్గొని మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులతో పాటు దళితులు పూర్వకాలం నుండే సహజీవనం చేస్తూ ఒకే కుటుంబ సభ్యులుగా అన్నదమ్ములుగా కలిసి  బ్రతికే వారిని 2000 సంవత్సరం జీవో నెంబర్ 3 వలన దళితుల జీవితాలలో దుర్భర పరిస్థితులు ఏర్పడినవి 22 సంవత్సరాల భవిష్యత్తు అంధకారములలో దళితులు దుర్భర జీవితాలు  గడుపుతున్నారని అన్నారు. ముఖ్యముగా  ఏజెన్సీ ప్రాంతంలో నివసించే ప్రజల పరిస్థితులు చాలా దయనీయంగా మారాయని బ్రిటిష్ ప్రభుత్వం రావడానికి పూర్వం నుండి. క్రీస్తుశకం. 16 00 సంవత్సరంకు పూర్వమే. భారత దేశంలో కొండలలో నివసించారని వీరిని బ్రిటిష్ వారు 1835 సంవత్సరములలో కొండ దళితులని పూర్వం నుండే నుండే పిలిచే వారిని అటువంటి ఏజెన్సీలలో నివసిస్తూ అప్పటినుండి ఇప్పటివరకు అడవులు తడిగిపోయి అడవుల లో చెట్ల మీద ఉండే. వాటి ఫలాలు ఆధారపడి ఆదివాసుల తోటి సహజీవనం సాగిస్తుండేవారు అని అన్నారు. అడవులు తరిగిపోయి ఏజెన్సీ ప్రాంత దళితులు రోజువారి కూలీలుగా మారారు. రోజులు మారినా కానీ దళితుల పేదరికం మారలేదు ఏజెన్సీ ప్రాంత దళిత కుటుంబాలు చాలా హీనమైన దుర్భర జీవితాలు సహజీవనం సాగిస్తున్నారు. పూర్వం నుండి ఆదివాసులతోటి .కలిసి బ్రతికేవారు. ఏజెన్సీ ప్రాంత దళితులకు దళిత బంధు పథకం కింద వచ్చే పది లక్షలు కాకుండా. 20 లక్షలు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని  కోరారు. ఈ  సమావేశంలో  .బ ఓస కవిత. పొగరు శ్రీలత .మీనరాతి సావిత్ర .చింగుడాల మంజుల. ఎల్లంకి స్వరూప.  ఓస రమేష్. పొగరు ఎల్లయ్య .మీనరాతి వెంకన్న. కారు నరసయ్య నాగేల్లి మల్లయ్య, కారు మల్లయ్య, సింగుడాల శాంతి వర్ధన్ ,నాగలి వెంకన్న, నాగలి శ్రీనివాసు నీలం వెంకన్న తదితరులు పాల్గొన్నారు.