ముగిసిన దర్గా ఉర్సు ఉత్సవాలు

Submitted by veerareddy on Tue, 27/09/2022 - 12:20
Ended Dargah Ursu celebrations
  • దర్గాను సందర్శించిన నగర సిపి తరుణ్ జోషి
  • వోల్లు గుభాలించిన ఫకీర్ల విన్యాసాలు
  • ప్రత్యేక ప్రార్ధనలు చేసిన భక్తులు.

కాజీపేట, సెప్టెంబర్ 26 (ప్రజాజ్యోతి) .///.  కాజీపేట దర్గా కాజీపేటలోని హజ్రత్ షా అఫ్జల్ బియబాని దర్గాలో మూడు రోజులపాటు నిర్వహించిన బియబాని ఉత్సవాలు సోమవారం సాయంత్రం నిరాడంబరంగా ముగిసాయి. దర్గా పీఠాధిపతి ఖుస్రు పాషా  సోమవారం బధవా కార్యక్రమం ను పురష్కరించుకుని భక్తులతో కలిసి ప్రత్యేక ప్రార్థకం చేసి బియబాని ఉత్సవాలు  ముగిసినట్లు తెలిపారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన ముస్లిం మత పెద్దలకు గౌరవంగా పీఠాధిపతి  ఖుస్రు పాషా తలపాగాను చుట్టి, పూల దండలు వేసి ఆశీర్వదించారు. అనంతరం దర్గా  ప్రాంగణంలో జరుగుతున్న ఉత్సవాలకు హైదరాబాద్, తదితర ప్రాంతాల నుంచి విచ్చేసిన ఫకీర్ల బృందం తమదైన శైలిలో ఇనుప సూదులను నాలుక శరీరంపై గుచ్చుకొని ఒళ్ళుగగురుపరిచే విధంగా విన్యాసాలు చేసి అందరిని మంత్రముగ్ధులను చేశారు. ముగింపు లో జరిగిన ఖవ్వాలి అందరిని ఆకట్టుకుంది. దర్గా ఉత్సవాల ముగింపు సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి దర్గా సందర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీఠాధిపతి ఖుస్రు పాషా మాట్లాడుతూ అఫ్జల్ బీయాబానీ ఆశీస్సులతో రాష్ట్రం దేశ విదేశాల భక్తులందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని అల్లాను ప్రార్ధించినట్లు తెలిపారు. బియబాని ఉత్సవాలను విజయవంతం చేసిన ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఉత్సవాలకు సౌకర్యాలు కల్పించిన జిల్లా కలెక్టర్ నగర పోలీస్ కమిషనర్ మున్సిపల్ కమిషనర్ తదితర జిల్లా యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు. భక్తులందరూ ఉత్సవాలను జయప్రదం చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఉప పీఠాధిపతి భక్తీయార్ బాబా అమర్ పాషా వివిధ ప్రాంతాల పీఠాధిపతులు మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.