ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఎన్నిక

Submitted by Sathish Kammampati on Thu, 01/09/2022 - 17:16
An election that preserves democracy
  • మునుగోడు తాజా మాజీ శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

 చండూర్ సెప్టెంబర్1( ప్రజా జ్యోతి): మునుగోడు నియోజక వర్గంలో జరిగే ఉప ఎన్నిక రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఎన్నిక అని మునుగోడు తాజా మాజీ శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.బుధవారం చండూర్ మాజీ సర్పంచ్ టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కోడి గిరిబాబు రాజగోపాల్ రెడ్డి సమక్షంలో భారతీయ జనతా పార్టీ లో చేరారు.

ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. టిఆర్ఎస్ పార్టీలో నాయకులకు సరైన గౌరవం లభించక బిజెపిలో అనేక మంది కార్యకర్తలు చేరుతున్నారని అన్నారు మునుగోడు నియోజకవర్గంలో ఈ ఎన్నిక ప్రత్యేక ఈ పరిస్థితులలో వచ్చిందన్నారు. కుటుంబ పాలనకు, అవినీతికి వ్యతిరేకంగా ఎన్నిక వచ్చిందన్నారు.

మునుగోడు ప్రజలు ఇచే తీర్పు రాష్ట్ర రాజకీయాలలో అనేక మార్పులను తీసుకురానున్నది అన్నారు. జిల్లా మంత్రి అవినీతి సొమ్ముతో ఇతర పార్టీలకు చెందిన నాయకులను కొనుగోలు చేసి టిఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటున్నారు అన్నారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో బిజెపి గెలిచి కేంద్రంలో మూడవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో కూడా బిజెపిని గెలిపించి నట్లయితే అభివృద్ధి వేగంగా జరుగుతుందన్నారు. కెసిఆర్ పాలనలో రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది అన్నారు. వచ్చే ఉప ఎన్నికల్లో ప్రజలు బిజెపిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కొత్త పాటి సతీష్, కొత్త అంజి బాబు, పల్లె వెంకన్న, సాపిడి రాములు, మాస కృష్ణ, వెంకటేశం, శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.