జిల్లా ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు గ్రంధాలయాల సంస్థ చైర్మన్ రాజ్ గౌడ్

Submitted by kosgi narsimulu on Mon, 03/10/2022 - 15:45
Dussehra wishes to all the people of the district Raj Goud, Chairman of the Library Association
  • - గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తా..
  • - తాండూరు నియోజకవర్గాన్ని  అభివృద్ధి  పథంలో నిలుపుతున్న ఎమ్మెల్యే
  • - ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు కృషి..
  • - వెయ్యి మందికి ఉచిత కోచింగ్ సెంటర్ నిర్వహించారు..
  • - అనేకమంది యువకులు ఎమ్మెల్యే వెంటా నడుస్తున్నారు..
  • - నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యెవారికి కావలసిన పుస్తకాలు సమకూరుస్తాం..

తాండూరు అక్టోబర్ 3 ప్రజా జ్యోతి:-  జిల్లా ప్రజలందరికీ   వికారాబాద్ జిల్లా  గ్రంధాలయాల సంస్థ చైర్మన్ రాజ్ గౌడ్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం   ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజ గౌడ్ మాట్లాడుతూ  జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ గా అవకాశం కల్పించిన జిల్లా మంత్రి సబితా ఇంద్రారెడ్డి తో పాటుజిల్లా ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, మెతుకు ఆనంద్,మహేష్  రెడ్డి,నరేందర్ రెడ్డిలతో పాటు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. తాండూరు పట్టణంలో  నూతన గ్రంథాలయ భవనం  నిర్మించేందుకురూ కోటి 35 లక్షల  నిధులు విడుదల చేయిస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా పాత లైబ్రరీ భవనాలను తొలగించిన నూతన భవనాలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి జిల్లా మంత్రికిపంపిస్తామని పేర్కొన్నారు. 
జిల్లాలోని గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. తాండూరు నియోజకవర్గాన్ని  అభివృద్ధి  పథంలో నిలుపుతున్న ఎమ్మెల్యే పైలట్ రోహిత్  రెడ్డి వింటావా అనేకం అది యువకులు నడుస్తున్నారన్నారు. అదేవిధంగా తాండూరు  మండలం జిన్గూర్తి  గ్రామ సమీపంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. నిరుద్యోగ యువత పోటి పరీక్షలకు సిద్ధం అయ్యే  వెయ్యి మందికి నిరుద్యోగులకు ఉచిత కోచింగ్ సెంటర్ ను 90 రోజుల పాటు నిర్వహించారని అలాగే  వారికి కావలసిన పుస్తక సామాగ్రిని సైతం అందించారని గుర్తు చేశారు.