ఎన్ఎస్పి అధికారుల నిర్లక్ష్యంతోనే కాలువకు గండి

Submitted by Paramesh on Mon, 19/09/2022 - 16:03
Due to the negligence of the NSP officials, the canal got clogged Open in Google Translate • F


నేరేడు చర్ల సెప్టెంబరు 19 ప్రజా జ్యోతి../  ఎన్ఎస్పి అధికారుల నిర్లక్ష్యం వల్లనే కాలువకు గండి పడిందని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు ఆరోపించారు.సోమవారం  నాడు ఆయన సిపిఐ బృందంతో కలిసి వివిధ గ్రామాల్లోనిరైతులతో మాట్లాడుతూ సాగర్ కాల్వకు గండి పడే ప్రమాదాలను కూడా ఎన్ఎస్పి అధికారులు గుర్తించలేని స్థితిలో ఉన్నారని, ఇప్పటికీ సుమారు పది రోజులుగా ఆయకట్టు ప్రాంతాన్ని నీరు లేక ఎంతో అల్లాడుతున్నారని, ఒక్కొక్క ఎకరానికి వేలాది రూపాయల పెట్టుబడి పెట్టి ఎంతో శ్రమకోర్చి రైతులు వ్యవసాయం చేశారని, ఈ సంవత్సరం నాటు వేసేందుకు కూలీలు దొరక్క రైతులు అనేక అవస్థల పాలయ్యారని  ఎలాగోలా నాట్లు వేసిన కొద్దిరోజులకే కాలువకు గండిపడి ఈ క్రింది ప్రాంతం రైతులు అల్లాడిపోయారని, గండిపడ్డ చోట వేలాధి ఎకరాలు మునిగిపోయి అక్కడ రైతులు  ఇబ్బంది పడ్డారని, నిడమనూరు మండలం వేంపాడు వద్ద సాగర్ కాలువకు గండిపడి రైతాంగంఎంతగానో నష్టపోతే కనీసం ఆ ప్రాంతాన్ని ఇంతవరకు జిల్లా మంత్రి సందర్శించకపోవడం బాధాకరమైన విషయం అని, తక్షణమే మంత్రితో సహా  అధికార పార్టీ నాయకులు ఆ ప్రాంతాన్ని పరిశీలించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఎన్ఎస్పి అధికారులు ఇంకా వారం రోజులకు నీళ్లు  వదిలే పరిస్థితి లేదు అని చెపుతున్నారని సుమారు 6 లక్షల ఎకరాల వరి పంట నష్టపోయే ప్రమాదం ఉన్నందున ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి రైతాo గానికి నీరు అందించాలని అప్పటిదాకా  వ్యవసాయ అవసరాలకు 24 గంటల కరెంటు సౌకర్యం కల్పిస్తే కొంతమేరకు రైతుకు ఆలంబనగా ఉంటుందని, ఇప్పుడు కేవలం 12 గంటలు మాత్రమే విద్యుత్తు సరఫరా జరుగుతుందని గండి పూర్తయ్య వరకు 24 గంటల విద్యుత్ సౌకర్యం రైతాంగానికి అందిస్తే తమ పొలాలతో పాటు అవసరమైన ఇతర రైతులకు కూడా నీరు అందించి కొంతమేర పంటలు కాపాడుకుంటారని ఆ వైపు ప్రభుత్వం ఆలోచన చేయాలని  ఆయన కోరారు.సిపిఐ బృందంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రావుల సత్యం, భాస్కర్ రావు, సంపత్తదితరులు ఉన్నారు