దొంగలేవరు.?... దోషులు ఎవరు.?...: డామిట్ కథ అడ్డం తిరిగింది ... దారి తప్పిన టాస్క్ ఫోర్స్... మంత్రి, ఎమ్మేల్యే పేరుతో బురడి... కోర్టు కేసు సంగతి మరిచిన పోలీసులు.....

Submitted by SANJEEVAIAH on Sat, 25/02/2023 - 10:37
Photo

దొంగలెవరు... దోషులెవరు...

డామిట్ కథ అడ్డం తిరిగింది

మంత్రి, ఎమ్మెల్యే పేరుతో తతంగం నడిపిన తీరు 

వాస్తవాలు బయటపడేది ఎప్పుడో.?

 కోర్టు కేసు సంగతి ఏమిటి.?

(నిజామాబాద్ ప్రతినిధి - ప్రజా జ్యోతి)

నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసుల పరిస్థితి "కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు" తయారయింది. సూత్రధారులను వదిలేసి పాత్రధారులను మాత్రమే పట్టుకున్నారు. లక్షల రూపాయలను కుమ్మేసిన వారు దర్జాగా కాలరేగిరేస్తుంటే పది పదిహేను వేల రూపాయలకు ఆశపడ్డ వారు జైలు పాలయ్యారు. దీంతో పోలీసుల  మజాకా అన్నట్టు తయారయింది. ఇదిలా ఉంటే ఈ నకిలీ ప్రభుత్వ పట్టాల వ్యవహారంలోనే కోర్టు ఆదేశాల మేరకు నిజామాబాద్ మూడవటానికి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదయింది. ఎఫ్ ఐ అర్ నం.13/2023 జనవరి మొదటి వారంలో ఈ కేసు నమోదు కాగా పోలీసులు ఇంతవరకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఈ కేసును తప్పుదోవ పట్టించేందుకు ఓ వ్యక్తి రంగంలోకి దిగి మంత్రి ప్రశాంత్ రెడ్డి పేరుతో పాటు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త పేరు వాడుతూ పోలీసులను తప్పుదోవ పట్టించినట్లు సమాచారం. ఈ కారణంగానే కేసులో మరికొంత మంది ఉన్నప్పటికీ వారికి ఉపశమనం కలిగించడం వెనుక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎఫ్ ఐ ఆర్ నమోదు అయినప్పటికీ ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడమే కాకుండా పాత్రధారులైన వారిని అరెస్టు చేశారు. సూత్రధారులను వదిలి వేయడం వెనక కాసులు చేతులు మారాయని ప్రచారం జరుగుతుంది. అయితే మంత్రి అనుచరుడుగా ఉన్న బాల్కొండ నియోజక వర్గానికి చెందిన ఓ టిఆర్ఎస్ నాయకుడు మధ్యవర్తిత్వంతో టాస్కు పోర్స్ పోలీస్ అధికారి గతంలో ఓ కేసును పరిష్కరించినట్లు తెలుస్తుంది. ఈ కేసు వ్యవహారాన్ని అడ్డం పెట్టుకొని టాస్క్ ఫోర్స్ పోలీసులను ఈ కేసులో తప్పుదోవ పట్టించినట్లు గట్టిగానే ప్రచారం జరుగుతుంది. వీరి మాటలు నమ్మిన పోలీస్ అధికారి కేసులు తప్పుదోవ పట్టించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అసలు ఏమి జరిగింది.?

నిజామాబాద్ దుబ్బా ప్రాంతానికి చెందిన 25 మందికి పైగా వారి పేర్లతో నకిలీ ప్రభుత్వ పట్టాలను తయారు చేశారు. ఇందులో కార్పొరేటర్ వద్ద 15 నకిలీ పట్టాలు ఉండగా పాత్రధారులైన ఇద్దరి వద్ద మరో ఎనిమిది నకిలీ పట్టాలు ఉన్నాయి. ఈ పట్టాలను అడ్డం పెట్టుకొని మున్సిపాలిటీ నుంచి ఇంటి నంబర్లను తీసుకొని రిజిస్ట్రేషన్లు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇక్కడ పంపకాల వ్యవహారంలో తేడా రావడంతో అసలు కథ మొదలైంది. అయితే పాత్రధారులు అయిన వారు ఒక్కొక్క పట్టాకు లక్ష రూపాయల చొప్పున వసూలు చేశారు. ఈ నకిలీ పట్టాలు తయారు చేసే వారికి రూ. 15 వేల నుంచి రూ.20 వేల వరకు ముట్టజెప్పి మిగిలిన సొమ్మును జేబులో వేసుకున్నారు. అలాగే మున్సిపల్ నుంచి ఇంటి నంబర్ల పేరుతో మరో రూ.50 వేల నుంచి రూ. 75 వేల వరకు వసూల్ చేసి మున్సిపాలిటీ మధ్యవర్తికి రూ.10 వేల నుంచి రూ.15 వేలు ముట్టచెప్పారు. మిగిలినవి మెక్కారు. ఇంత వరకు బాగానే ఉన్నా ఈ మిగిలిన డబ్బుల పంపకాలలో వచ్చిన తేడాతో విభేదాలు మొదలు అయ్యాయి. అప్పటికే నకిలీ పట్టాల వ్యవహారం బయటకు రావడంతో బాధితులు ఆందోళనకు దిగారు. కలెక్టర్ నుంచి సీపీ వరకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండా పోయింది. మధ్యవర్తిత్వం వహించిన దుబ్బ కు చెందిన వ్యక్తి కోర్టు మెట్ల ఎక్కారు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు నిజామాబాద్ మూడవ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. జనవరి మొదటి వారంలోనే నమోదు అయింది. అప్పటినుంచి ఇప్పటివరకు ఈ కేసుపై పోలీసులు స్పందించలేదు. దీంతో మరోసారి కోర్టులో వివాదాస్పదం అవుతుందని తెలిసింది. ఈ కేసులో కీలకంగా ఉన్న వ్యక్తి చక్రం తిప్పడం మొదలుపెట్టారు. దీనికోసం టాస్క్ ఫోర్స్ పోలీసులను ఎంచుకొని తప్పుదోవ పట్టించే పనిలో పడ్డారు. ఇలా తమకేమీ సంబంధం లేదని నమ్మించి కేసును పూర్తిగా దారి మళ్లించారు. నేరం చేసిన వాడితో పాటు నేరం చేయించిన వారిది కూడా నేరమే అని సూత్రాన్ని పోలీసులు మరీచినట్లు ఉన్నారు.

కేసు కొలిక్కి వచ్చేది ఎప్పుడో.?

నకిలీ పట్టా పత్రాల కేసు ఇంకా కొలిక్కి రాలేదు. అసలు విషయం బయట పెట్టీ కేసు నమోదు చేయించిన సంగతి పక్కన పెట్టీ రెండో కేసు నమోదు చేశారు. కానీ మొదటి కేసు విషయాన్ని గాలికి వదిలేశారు. గుట్టు బయట పడింది. కానీ బాధితుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసిన వారిన మాత్రం వదిలి వేశారు. ఇప్పటికే ఈ కేసును తప్పుతోవ పట్టించేందుకు మరో ముగ్గురిపై కేసు పెట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. దీని కోసం గతంలో కొన్ని ఫోన్ కాల్ రికార్డులను అడ్డం పెట్టుకొని హడావిడి చేస్తున్నారు. పత్రిక విలేకరులకు సైతం తప్పుడు సమాచారం ఇస్తున్నారు. కాంటేశ్వర్ ప్రంటంలోని భూ పట్టాల వ్యవహారాన్ని కూడా ఇలాగే దారి తప్పించారు. ఈ బాధితులు సైతం పోలీసుల పనితీరుపై అనుమానించి ప్రస్తుతం కోట్లు మెట్లు ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు. నిజామాబాద్ నగరంలో నకిలీ పట్టాలతో పాటు నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు చేసిన వ్యవహారంలో పూర్తిగా గుట్టు బయట పెడతారు అనుకున్న బాధితులకు నిరాశే మిగిలింది.