గ్రంధాలయంలో 'డాక్టర్ కేర్' ఉచిత హోమియోపతి వైద్య శిభిరం.

Submitted by Praneeth Kumar on Wed, 15/03/2023 - 14:38
'Doctor Care' free homeopathy medicine camp at Central Library.

'డాక్టర్ కేర్' ఉచిత హోమియోపతి వైద్య శిభిరం.

ఖమ్మం, మార్చి 15, ప్రజాజ్యోతి.

బుధవారం ఖమ్మం జిల్లా గ్రంధాలయంలో 'డాక్టర్ కేర్ పోసిటివ్ హోమియోపతి' ఆధ్వర్యంలో గ్రంధాలయం విసిటర్స్ కి, సిబ్బంది కి ఉచిత వైద్య శిబిరాన్ని డిక్ట్రిక్ట్ గ్రంధాలయం చైర్మన్ కె ఉమా మహేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ కేర్ వైద్యులు జి రాజేష్ బాబు బిపి, షుగర్ మొదలగు పరీక్షలు నిర్వహించి అక్యూట్, క్రానికల్ రుగ్మతులకు హోమియోపతి వైద్యం ఎలా పనిచేస్తుందో వివరిస్తూ మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ గ్రంథాలయ చైర్మన్, సెక్రటరీ వి అర్జున్ ఇలాంటి క్యాంపులు నిర్వహిస్తూ హోమియోపతి వైద్యం ప్రాముఖ్యతను ప్రజల్లో కి తీసుకువెళ్తున్నందుకు 'డాక్టర్ కేర్' సంస్థ సిఈఓ డాక్టర్ ఏఎం రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి క్యాంపులు మరెన్నో నిర్వహించి, సైడ్ ఎఫెక్ట్స్ లేని హోమియోపతి వైద్యం పట్ల మరింత అవగాహనను కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కేర్ ఖమ్మం బ్రాంచ్ పిఆర్ఓ పి ప్రణీత్ కుమార్, ఫార్మాసిస్ట్ అస్మా, గ్రంధాలయం అసిస్టెంట్ లైబ్రేరియన్ ఆర్ నాగన్న, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.