ఐటి హబ్ లో 'డాక్టర్ కేర్' ఉచిత హోమియోపతి వైద్య శిభిరం.

Submitted by Praneeth Kumar on Wed, 25/01/2023 - 18:29
'Doctor Care' free homeopathy medical camp at IT Hub.

ఐటి హబ్ లో 'డాక్టర్ కేర్' ఉచిత హోమియోపతి వైద్య శిభిరం.

ఖమ్మం, జనవరి 25, ప్రజాజ్యోతి.

బుధవారం ఖమ్మం ఐటి హబ్ లో 'డాక్టర్ కేర్ పోసిటివ్ హోమియోపతి' ఆధ్వర్యంలో సాఫ్ట్వేర్ కార్యాలయాల సిబ్బందికి ఉచిత వైద్య శిబిరాన్ని టిఎస్ఐఐసి జోనల్ మేనేజర్ పవన్, మేనేజర్ సురేష్ ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ కేర్ వైద్యులు గుడిమల్ల రాజేష్ బాబు బిపి, షుగర్ మొదలగు పరీక్షలు నిర్వహించి అక్యూట్, క్రానికల్ రుగ్మతులకు హోమియోపతి వైద్యం ఎలా పనిచేస్తుందో వివరిస్తూ మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జెడ్ఎం పవన్ మాట్లాడుతూ ఇలాంటి క్యాంపులు నిర్వహిస్తూ హోమియోపతి వైద్యం ప్రాముఖ్యతను ప్రజల్లో కి తీసుకువెళ్తున్నందుకు 'డాక్టర్ కేర్' సంస్థ సిఈఓ డాక్టర్ ఏఎం రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం వైద్య పరీక్షలు చేయించుకున్న ఐటి హబ్ సాఫ్ట్వేర్ మేనేజర్ లు మాట్లాడుతూ మున్ముందు ఇలాంటి క్యాంపులు మరెన్నో నిర్వహించి, సైడ్ ఎఫెక్ట్స్ లేని హోమియోపతి వైద్యం పట్ల మరింత అవగాహనను కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కేర్ ఖమ్మం బ్రాంచ్ పిఆర్ఓ పి ప్రణీత్ కుమార్, ఫార్మాసిస్ట్ అస్మా, ఐటి హబ్ సాఫ్ట్వేర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.