భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్ చొరవ చూపాలి

Submitted by sridhar on Thu, 08/09/2022 - 10:19
The district collector should take initiative to solve the problems of land dwellers
  • రైతులు, అఖిల పక్ష ఐక్య కార్యాచరణ సమితి.

నాగర్ కర్నూల్ (ప్రజా జ్యోతి న్యూస్ ).ఉయ్యాలవాడ శివారులో నిర్మిస్తున్న మెడికల్ కళాశాల భూ నిర్వాసితులు నేడు మరోసారి తమ సమస్యలు పరిష్కరించాలని జిల్లా పరిపాలన అధికారి శ్రీనివాసులు కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతులు మరియు అఖిల పక్ష ఐక్య కార్యాచరణ సమితి నేతలు మాట్లాడుతూ తేది 02-09-22 రోజు అఖిల పక్ష ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తే, జిల్లా జాయింట్ కలెక్టర్ మనూ చౌదరి ధర్నా కార్యక్రమం విరామింప జేయడం జరిగింది. తేది 05-09-22 రోజు చర్చలకు అనీ పిలిచి అధికారులు రాకపోవడం గమనార్హం అనీ తెలిపారు.

సామాజిక మధ్యమాల్లో ప్రచారం అవుతున్నట్లు రైతులు చర్చలకు రాకపోవడం అనే మాటలు నిజం కాదని అన్నారు. రైతులు తమ సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ చర్చలకు సిద్ధంగానే ఉన్నారని వివరించారు. అందుకే నేడు మరోసారి జిల్లా పరిపాలన అధికారికి వినతి పత్రం ఇచ్చి, తమతో జిల్లా కలెక్టర్ మాట్లాడి, తమ సమస్యల పరిష్కరానికై కృషి చేయాలనీ వారు కోరారు. తమకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం భూమికి బదులు భూమి ఇవ్వాలని, భూమి ఇవ్వలేని పక్షంలో చట్టం ప్రకారం ప్రస్తుతం ఉన్న మార్కెట్ రేటుకు అదనంగా 3రేట్ల అధిక నష్ట పరిహారం, కుటుంబానికి ఒక డబల్ బెడ్ రూమ్ ఇళ్ళు, మెడికల్ కళాశాలలో కాంట్రాక్టు బేసిక్ కింద ఉద్యోగాలు, 200గజాల షట్టర్ బిట్టు ప్లాట్ తో పాటు, దళిత బంధు పథకం వర్తింపు చేయాలనీ కోరారు.

అట్లాగే తమను మోసం చేసి సర్వే పేరుతో తమ సంతకాలు తీసుకున్న ఉయ్యాలవాడ తెరాస నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలనీ కోరారు. ఇ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అర్థం రవి, పాండు, భీమయ్య, బిఎస్పీ పార్టీ జిల్లా* కార్యదర్శి బోనాసి రాంచందర్, అసెంబ్లీ అధ్యక్షులు పృథ్వీ రాజ్, MRPS జాతీయ ప్రధాన కార్యదర్శి కోళ్ల శివ, సీపీఎం పార్టీ నాయకులు అశోక్, సామాజిక కార్యకర్త వావిలాల రాజశేఖర్ శర్మ, బిఎస్పీ నాయకులు శంకర్, బాల్ రాజ్ మరియు రైతులు మధు, కురుమూర్తి, తప్పేట రాములు, బాల్ రామ్, శివ శంకర్ లు పాల్గొన్నారు.