శివాలయానికి నాగపడగ, పాణి వాటం వితరణ

Submitted by sridhar on Sat, 10/09/2022 - 15:19
Distribution of Nagapadaga and Pani to Shiva temple

గద్వాల ప్రతినిది (ప్రజాజ్యోతి) సెప్టెంబర్ 10 : జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలోని ఆదిశిలా క్షేత్రం, హరిహరాదులకు నిలయమై క్షేత్రపాలకుడు ఈశ్వరుడు కొలువైన శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ఆవరణలోని శివాలయానికి వెండితో తయారు చేసిన నాగపడగ, పాణి వాటం ను బళ్లారికి చెందిన లక్ష్మీదేవమ్మ కుమారులు గుండా చారి, బీమా చారి బహూకరించారు. శనివారం తిమ్మప్ప ఆలయంలో, శివాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి శివలింగానికి అలంకరించారు. ఈ సందర్భంగా దాతలకు ఆలయ చైర్మన్ ప్రహల్లాద రావు ఆధ్వర్యంలో  సన్మానం చేశారు.