హోప్ చైల్డ్ కేర్ సెంటర్ లోని విద్యార్థులకు నిత్యావసర సరుకులు గిఫ్ట్ ప్యాకెట్లు పంపిణీ

Submitted by sridhar on Tue, 13/09/2022 - 19:55
Distribution of essential commodities gift packets to the students of Hope Child Care Center

వెంకటాపురం (నూగూరు) సెప్టెంబర్ 13 (ప్రజా జ్యోతి) ; వెంకటాపురం మండలం లోని ముక్కునూరుపాలెం గ్రామంలో ని  హెచ్ సిఎస్ చైల్డ్ కేర్ సెంటర్ లోని 75 మంది నిరుపేద విద్యార్థినీ విద్యార్థులకు బియ్యం, నిత్యావసర సరుకులు  గిఫ్ట్ ప్యాకెట్లును జడ్పీటిసి పాయం రమణ చేతులు మీదుగా పంపిణీ చేశారు.. ఈ సదర్భంగా జడ్పీటిసి మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని తమ పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకరావాలని కోరారు. హోప్ చారిటబుల్ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. ఇలాంటి కార్యక్రమం లో పాల్గొనడం ఆనందం గా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెంటర్ ఇంఛార్జి పున్నం సోలమన్,  సిబ్బంది, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు మరియు సంస్థ సిబ్బంది  పాల్గొన్నారు.