ఆడపడుచుల ఆత్మగౌరవం కోసమే బతుకమ్మ చీరల పంపిణీ. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు.

Submitted by veerareddy on Fri, 23/09/2022 - 12:44
Distribution of Bathukamma sarees is for the self-respect of women.  MLA Guvwala Balaraju.


అచ్చంపేట సెప్టెంబర్ 22 ప్రజా జ్యోతి. ఆడపడుచుల ఆత్మగౌరవం కోసమే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారని అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు గురువారం అచ్చంపేటలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ చేశారు అదేవిధంగా వంగూరు చారగొండ మండల కేంద్రాల్లో కూడా బతుకమ్మ చీరలు మహిళలకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ధ్యాస వ్యాస సంప్రదాయ పద్ధతులను అవలంబిస్తూ ప్రతి సంవత్సరం ముఖ్యమంత్రి కేసీఆర్ దసరాకు ముందు బతుకమ్మ చీరలను ప్రతి సంవత్సరం పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన అన్నారు ప్రతి మహిళకు బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నామన్నారు బతుకమ్మ చీరలతో కోలాటాలు బతుకమ్మ ఆటపాటలతో పండుగ వాతావరణంతో జరుపుకోవాలని అన్నారు మహిళల పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు అన్ని మండలాల్లో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డిఓ పాండు నాయక్ మున్సిపల్ చైర్మన్ నరసింహ గౌడ్, జెడ్పిటిసి మంత్రియా నాయక్ రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు మనోహర్ కొండనాగుల సింగిల్ విండో చైర్మన్ నర్సయ్య యాదవ్ టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు రమేష్ రైతు సమితి అధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి మాజీ ఎంపీపీ పర్వతాలు తహసిల్దార్ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.ఫోటో రైట్ అప్ చీరలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే తదితరులుపాల్గొన్న మహిళలు.