గ్రేస్ సర్వీస్ సొసైటి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు బ్యాగ్స్, నోట్ పుస్తకాలు, పలకలు, పెన్నులు గిఫ్ట్ పాకెట్స్ పంపిణీ

Submitted by veerareddy on Wed, 07/09/2022 - 15:10
Distribution of bags, note books, tablets, pens and gift pockets to students under the auspices of Grace Service Society charity organization

వెంకటాపురం (నూగూరు) సెప్టెంబర్ 06 (ప్రజా జ్యోతి) గ్రేస్ సర్వీస్ సొసైటి స్వచ్చంధ సేవా సంస్థ ఖమ్మం వారు, ములుగు జిల్లా వెంకటాపురం  మండలంలోని మంగళవారం రంగరాజాపురం,బి సి మర్రిగుడెం, నెలారుపేట, వి ఆర్ కె పురం , చోక్కాల, పాలెం  రశపల్లి గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుచున్నా 550 మంది నిరుపేద విద్యార్థిని విద్యార్ధులకు రెండు లక్షల యాబైవేల రూపాయల విలువ చేసే బ్యాగ్స్, నోట్ పుస్తకాలు, పలకలు, పెన్నులు గిఫ్ట్ పాకెట్స్ లను పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ నాగరాజు,గ్రామ సర్పంచ్ లు, పూణెం శ్రీదేవి, స్కూల్ ప్రదానోపాద్యులు తెరాస సీనియర్ నేత ఆచ్చా నాగేశ్వరరావు ,పాల్గొని వారి చేతులు మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేద విద్యార్థిని విద్యార్థులకు బ్యాగ్స్, నోట్ బుక్స్, పలకలు ఇవ్వడం చాలా సంతోషకరమని ఇటువంటి సహాయాన్ని అందిస్తున్నటువంటి, గ్రేస్ సొసైటీ స్వచ్ఛంద సేవ సంస్థ కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. మారుమూల  గ్రామాలలో పేద పిల్లలకు సాయం చేయడానికి ఇటువంటి  స్వచ్ఛంద సంస్థల ముందుకు రావడం అభినందనీయమని సంస్థ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. స్వచ్ఛంద సేవా సంస్ధ ప్రతినిధులు ములుగు జిల్లా క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ మీడియా అధికార ప్రతినిధి కర్ని నాగేశ్వరరావు, కాల ప్రసాద్, జీ ప్రేమరాజ్,  మురళీ కృష్ణ రెడ్డి, సైదులు, సతీష్, జయరాజ్,  విద్యార్థులతల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.