మిన్నంటిన జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సంబరాలు

Submitted by veerareddy on Fri, 16/09/2022 - 14:20
Diamond Jubilee celebrations of national unity

జనగామ, సెప్టెంబర్ 16. ప్రజాజ్యోతి :- జనగామ జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున 15 వేల మంది జనాభాతో ప్రారంభించిన జాతీయ సమైక్యత వజ్రోత్సవాల ర్యాలీ సంబరాలు మిన్నంటాయి.శుక్రవారం జిల్లా కేంద్రంలోని రోడ్లు భవనాలు అతిథి గృహం వద్ద ర్యాలీ ఏర్పాట్లు చేపట్టగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అసెంబ్లీ భవనానికి భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నామకరణం చేయడంతో జిల్లాలో ప్రజలు బాణాసంచా కాల్చి తమ ఆనందాన్ని వెల్లువుల వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి జాతీయ సమైక్యత వజ్రోత్సవాల ర్యాలీని జండా ఊపి ప్రారంభించారు.ప్రజలంతా క్రమశిక్షణతో ర్యాలీలో పాల్గొనగా మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొనడం విశేషం చిన్నారులతో మహిళలు పాల్గొనడం ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.మొబైల్ మైక్ ఏర్పాటు చేసి ర్యాలీలో శాసనసభ్యులు ప్రజలను ఏకీకృతం చేయడంలో విజయం సాధించారు.

ఒక తాటిపై నడిపించి ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నారు.విద్యార్థులు క్రమశిక్షణతో పాల్గొనగా రైల్వే ఓవర్ బ్రిడ్జిపై నుండి నెహ్రూ చౌక్ చేరుకోక అక్కడనుండి బస్టాండ్ చౌరస్తా మీదుగా ప్రిస్టన్ కళాశాల ఆవరణలో ఏర్పాటుచేసిన సభకు ర్యాలీ చేరుకుంది.ట్రాఫిక్ లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ శాఖ సమన్వయంతో చర్యలు తీసుకోవడం ప్రజలకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.సమన్వయంతో ప్రజా ప్రతినిధులు అధికారులు విద్యార్థిని విద్యార్థులు స్వయం సహాయక సంఘాల మహిళా  సభ్యులు అంగన్వాడి టీచర్లు ఆశ కార్యకర్తలు ఏఎన్ఎంలు సంయుక్తంగా పాల్గొని ర్యాలీకి వన్నె తెచ్చారు.