వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని ధర్నాః

Submitted by venkat reddy on Tue, 27/09/2022 - 16:00
 Dharnah to provide 24 hours electricity to agriculture

 నిడమనూరు, సెప్టెంబర్ 26(ప్రజాజ్యోతి):   వ్యవసాయానికి 24 గంటల ఉచిత  విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తు సోమవారం నిడమనూరు విద్యుత్ కార్యాలయం ఎదుట తెలంగాణ రైతు సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి కూన్ రెడ్డి నాగిరెడ్డి  మాట్లాడుతూ ప్రభుత్వం 24 గంటల విద్యుత్ ఇస్తామని గొప్పలు చెప్పడం తప్ప ఎక్కడ ఇచ్చింది లేదన్నారు. ఎన్నెస్పి ఎడమ కాలువకు గండి పడి ఓ పక్క రైతులు తీవ్రంగా నష్ట పోతే, మరోపక్క విద్యుత్ సరఫరా చేయకపోవడంతో  అందక బోర్ల కింద పొలాలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. తరచూ విద్యుత్ కోతల వల్ల మోటార్లు కాలిపోతున్నాయి. అన్ని పొలాలు నీళ్లు పారడం లేదని ఎండిపోయి తీవ్రంగా నష్టపోతుందని పేర్కొన్నారు. ప్రాజెక్టులు పూర్తిగా నిండి ఉన్న విద్యుత్ పుష్కలంగా ఉత్పత్తి అవుతున్నప్పటికి  రైతులకు ఉచితంగా 24 గంటల విద్యుత్ సరఫరా కాకపోవడం లేదని అన్నారు. నిరంతరాయంగా వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇవ్వాలని, విద్యుత్  సరఫరా అరికట్టాలని కోరుతూ విద్యుత్ ఏఈ వెంకటేశ్వర్లు కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు  కొండేటి శ్రీను, రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు పల్ రెడ్డి సత్యనారాయణ రెడ్డి, నల్లబోతు సోమయ్య,కోమండ్ల గురువయ్య, కోతి ఇంద్రారెడ్డి, జక్కలి శ్రీనివాస్, నాగరాజు, తగుల కోటయ్య, , కందుకూరి కోటేష్, కుంచెం శేఖర్, చంద్రారెడ్డి, వింజమూరి శివ, బిక్షం రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.