దీపావళి బాంబుల నిప్పు పడి కాలిపోయిన పత్తి, సుమారు లక్ష రూపాయల చేతికందిన పంట నష్టం

Submitted by lenin guduru on Wed, 26/10/2022 - 08:56
Cotton

దీపావళి బాంబుల నిప్పు పడి కాలిపోయిన పత్తి

సుమారు లక్ష రూపాయల చేతికందిన పంట నష్టం

దేవరుప్పుల, అక్టోబర్ 25, ప్రజాజ్యోతి:-
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధర్మగడ్డ తండా గ్రామ పంచాయితీ పరిధిలోని దొడ్లబండ తండా గ్రామంలో బానోతు శ్రీను అనే రైతు తన మూడు ఎకరాలలో సాగుచేసిన దాదాపు పది క్వింటాళ్ల పత్తిని తన నివాస పరిధిలో ఎండపెట్టాడు. అయితే మంగళవారం పిల్లలు దీపావళి పండగను పురస్కరించుకొని బాంబులు కలుస్తుండగా ప్రమాదవశాత్తు నిప్పు పత్తిలో పడి మంటలు చెలరేగాయి. స్థానికులు మంటలు ఆర్పేందుకు నీళ్ళు చల్లినప్పటికి ఫలితం లేకుండా పోయింది. దీంతో దాదాపు రూ.లక్ష వరకు నష్టం వాటిల్లిందని రైతు లబోదిబోమంటున్నారు. ఈ పరిణామానికి రైతు శ్రీను తీవ్ర ద్రిగ్బాంతి కి గురయ్యి నష్టానికి నష్ట పరిహారం చెల్లించాలని కోరాడు.