రాచకొండ భూములకు పట్టాలివ్వాలని తాసిల్దార్ కు వినతిపత్రం అందిస్తున్న కాంగ్రెస్ నేతలు

Submitted by veeresham siliveru on Mon, 05/09/2022 - 15:43
The Congress leaders are presenting a petition to the Tahsildar to hand over the Rachakonda lands

 

  • రాచకొండ గిరిజనులకు పట్టాలు ఇవ్వాలి
  • ధరణి భూ సమస్యల వేదిక కన్వీన మండే నర్సింహారెడ్డి 

సంస్థాన్ నారాయణపురం సెప్టెంబర్ 5 , ప్రజా జ్యోతి : ధరణి పోర్టల్ సమస్యను పరిష్కరించి రాచకొండ గిరిజనులకు పట్టాలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నాయకుడు,  ధరణి భూసమస్యల వేదిక కన్వీనర్ మన్నే నర్సింహారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల తహసిల్దార్ కార్యాలయం ముందు సోమవారం నాడు రాచకొండ గిరిజనులతో కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం తాసిల్దార్ శ్రీనివాసరాజుకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మన్నే నర్సింహారెడ్డి మాట్లాడుతూ రాచకొండ భూములు నమ్ముకొని తరతరాలుగా వేలాదిమంది గిరిజనులు, బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారని తెలిపారు.

రాచకొండ భూములు నమ్ముకుని సుమారు 14 రెవిన్యూ గ్రామాల ప్రజలు పట్టాలు పొందారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బడుగు ,బలహీన వర్గాలకు, గిరిజనులకు పట్టాలని ఇచ్చి భూ హక్కులను కల్పించిందని తెలిపారు. తెలంగాణ ఏర్పడితే తమ జీవితాలు మెరుగవుతాయని గిరిజనులంతా తెలంగాణ పోరాటంలో కలిసి వచ్చారని తెలిపారు.  గిరిజన, బడుగు, బలహీన వర్గాలను మోసం చేస్తూ కెసిఆర్ ప్రభుత్వం ధరణి పోర్టల్ ను తీసుకు వచ్చిందని విమర్శించారు. ఈ ధరణి పోర్టల్ వలన వేలాదిమంది గిరిజనులు, బడుగు ,బలహీన వర్గాలకు పట్టాదారు పాసుపుస్తకాలు అందడం లేదని తెలిపారు. దీనితో అక్కడి రైతులకు రైతుబంధు, రైతు బీమా ,ఫసల్ బీమా వంటి పథకాలు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి తోడు అటవీశాఖ అధికారులు ఇక్కడ గిరిజనులను, బడుగు, బలహీన వర్గాలను సాగు చేసుకోకుండా ఆటంకాలు కలిగిస్తున్నారని ఆరోపించారు.

రైతులు సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూముల్లో చెట్లను నాటి ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. అడ్డువచ్చిన రైతులపై కేసులు నమోదు చేస్తూ భూములను లాగుకుంటున్నారని ధ్వజమెత్తారు. వెంటనే ధరణి పోర్టల్ ను  సవరించి గిరిజనులతో పాటు మండల వ్యాప్తంగా ఇబ్బందులు పడుతున్న రైతులందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు అందించాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు హెచ్చరించారు.  ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా నాయకుడు ఏపూరి సతీష్, కాంగ్రెస్ నాయకులు బంధువుల బాలకృష్ణ, రాస మల్ల యాదయ్య, ఎండి అక్బర్, ప్రజ్ఞా నాయక్, రాచకొండ రమేష్, రత్తిపల్లి యాదయ్య, శ్రీను నాయక్ ,రవి నాయక్, గోవర్ధన్ ,నాయక్ భూషణ్ తదితరులు పాల్గొన్నారు.