నారాయణ ఒలంపియాడ్ పాఠశాలలో 'మోడల్ యునైటెడ్ నేషన్' ప్రోగ్రాం నిర్వహణ.

Submitted by Praneeth Kumar on Thu, 15/09/2022 - 06:28
Conducted 'Model United Nation' program at Narayana Olympiad School.

నారాయణ ఒలంపియాడ్ పాఠశాలలో 'మోడల్ యునైటెడ్ నేషన్' ప్రోగ్రాం నిర్వహణ.

ఖమ్మం అర్బన్, సెప్టెంబర్ 14, ప్రజాజ్యోతి.

స్థానిక కవిరాజ్ నగర్ రోడ్ లో గల నారాయణ ఒలంపియాడ్ పాఠశాలలో 'మోడల్ యునైటెడ్ నేషన్' పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో ఖమ్మంలోని రెండు పాఠశాలల, మధిర, సత్తుపల్లి పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. పోటీల్లో పాల్గొన్న విద్యార్థులను అభినందిస్తూ, గెలుపొందిన విద్యార్థులు డిసెంబర్లో జరుగు రాష్ట్ర స్థాయి పోటీలకు సిద్ధంగా ఉండాలని ఏజిఎం కోటేశ్వరరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ హైమావతి, కో ఆర్డినేటర్ పున్నంచందర్, వినోద్ లక్ష్మి, ఆర్ఎస్టి జాజిరెడ్డి, లఘుపతి, వివిధ పాఠశాలల ప్రిన్సిపాల్స్ సురేష్, అజయ్ డీన్ కార్తీక్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ నరేష్, యశ్వంత్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని అభినందనలు తెలిపారు.