కామ్రేడ్ షాహిద్ భగత్ సింగ్ స్ఫూర్తి యువత కు ఆదర్శం

Submitted by Sathish Kammampati on Thu, 29/09/2022 - 13:52
Comrade Shahid Bhagat Singh's inspiration is a role model for the youth


నల్లగొండ సెప్టెంబర్ 28(ప్రజాజ్యోతి).//.. స్వాతంత్ర్య సమర యోధుడు కామ్రేడ్ షాహిద్ భగత్ సింగ్ 115వ జయంతి సందర్భంగా నర్సింగ్ బట్ల గ్రామ భగత్ సింగ్ యువజన సంఘం ఆధ్వర్యంలో నల్లగొండలోని రెడ్ క్రాస్ భవన్ లో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది.సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ  దేశ స్వాతంత్య్రం కోసం 23సంవత్సరాల వయస్సు లో చిరు నవ్వు నవ్వుతూ,ఉరి కోయ్యలకు ముద్దాడి తమ అముల్యమైన ప్రాణాలను అర్పించటం జరిగిందన్నారు.వ్యక్తులను చంపగలరేమో కాని వారి ఆశయాలను చంపలేరని, జీవితాన్ని ప్రేమిస్తాం, మరణాని ప్రేమిస్తాం, మేం మరణించి ఎర్ర పూల వనంలో పూలై పూస్తాం నిప్పు రవ్వల మిద నిద్రిస్తాం ఉరి కోయ్యలను ఎగతాళి చేస్తాం అంటూ దేశం కోసం భగత్ సింగ్ త్యాగం చేశారని వారు అన్నారు.భగత్ సింగ్ కు భారత రత్న ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భగత్ సింగ్ జయంతి,వర్ధంతి కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించాలని వారు కోరారు. రక్తదానం పట్ల ప్రజలలో ఉన్న అపోహలను తొలగించి యువత స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని కోరారు రక్తదానం ప్రాణదానంతో సమానమని ఆపద సమయంలో రక్తాన్ని అందించడం ద్వారా ప్రాణాలను నిలబెట్టవచ్చని అన్నారు.రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన నర్సింగ్ బట్ల గ్రామ యువకులను అభినందించారు ఇదే స్ఫూర్తితో మరింత మందిని రక్త దానం చేసే విధంగా ప్రోత్సహించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి  నర్సింగ్ పట్ల మాజీ సర్పంచ్ ముక్కాముల యాదయ్య, ఎం వి ఎన్ ట్రస్ట్ కార్యదర్శి పుచ్చకాయల నర్సిరెడ్డి సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, మండల కన్వీనర్ పోలే సత్యనారాయణ భగత్ సింగ్ యువజన సంఘం నర్సింగ్ బట్ల యువకులు చామకూరి మహేష్, బల్లెం ప్రవీణ్, కోమట్ల శివ,రాపోలు పవన్, చామకూరి గణేష్, ముగుదాల నవీన్, తిరుమల సైదులు, తిరుమల శివ, నార్మల్ శివ, కర్నాటి నిఖిల్, కోటేష్ పాల్గొన్నారు.