జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డులు పొందేందుకు సమిష్టిగ కృషి చేయాలి

Submitted by Yellaia kondag… on Sat, 24/09/2022 - 11:32
A collective effort should be made to get National Best Panchayat Awards

తుంగతుర్తి, సెప్టెంబర్ 23 ( ప్రజా జ్యోతి):  జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డులు పొందేందుకు  ఇచ్చిన ఆన్లైన్ ప్రశ్నావళికి సరైన జవాబులు నింపేందుకు పూర్తి అవగాహన  కలిగి ఉండాలని వివిధ శాఖల అధికారులను ఎంపీడీవో భీమ్ సింగ్ నాయక్ ఆదేశించారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో జాతీయ  పంచాయతి రాజ్ అవార్డులకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేస్తూ జారీ చేసిన ఆన్లైన్ ప్రశ్నావళి పై మండల అధికారులకు, కార్యదర్శులకు  అవగాహన కల్పించారు. 9 థీమ్ లలో పంచాయతీరాజ్, విద్య, వైద్యం, స్త్రీ శిశు సంక్షేమం,గ్రామ పంచాయతి లలో మౌళిక సదుపాయాలు, జీవనోపాధి తదితర అంశాలపై  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ప్రవేశపెట్టిన పథకాల అమలు తీరు పై ప్రశ్నలు ఇవ్వడం జరిగిందన్నారు.ఒక్కో ప్రశ్న పై  అవగాహన కల్పించారు.గ్రామ స్థాయిలో పూర్తి అవగాహన కలిగి ఉండి పూర్తి డేటాతో ఉంటేనే ఆన్లైన్ లో ప్రశ్నలకు సరైన జవాబులు ఇవ్వవచ్చన్నారు.సరైన సమాచారంతో  సమాధానాలు నింపి మండలం  నుండి ఎక్కువ అవార్డులను సాధించేందుకు మండలాన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ఆయా శాఖల పూర్తి సమాచారం ఇచ్చి సహకరించాలని అదేవిధంగా మండల వివిధ శాఖల అధికారులు, కార్యదర్శులు సమన్వయంతో పనిచేసి అత్యధిక  అవార్డులు సాధించేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈఈ జాన్ ఫ్రెడ్, ఎంఈఓ బోయినీ లింగయ్య, ఏపిఎం వెంకన్న, వివిధ గ్రామాల కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.