సీఎం సహాయ నిధిని సద్వినియోగం చేసుకోవాలి.

Submitted by veerareddy on Thu, 08/09/2022 - 17:04
The CM's relief fund should be utilized.

కొత్తగూడ తెరాస మండల అధికార ప్రతినిధి నెహ్రూ నాయక్ బానోత్ .

కొత్తగూడ సెప్టెంబర్ 08 (ప్రజా జ్యోతి) .మండలం ముస్మి గ్రామానికి చెందిన బానోత్ పరేగన్ అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందింది మహబూబాబాద్ జిల్లా అధ్యక్షురాలు ,పార్లమెంట్ సభ్యురాలు మాలోతు కవిత చోరువతో  సీఎం సహాయ నిధి నుంచి మంజూరు అయిన 28,000 రూపాయల చెక్కును వారి కుటుంబ సభ్యులకుఅందజేశారు.ఈసందర్భంగా నెహ్రూ నాయక్  మాట్లాడుతుపేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేయడం జరిగింది అని ఆయన గుర్తు చేశారు.సీఎం సహాయ నిధి పేద ప్రజలకు వెలుగులు నింపుతుంది  అన్నారు, ఆపదలో సీఎం సహాయ నీది ఆపద్భందువునిగ అదుకుంటుంది అని ఆయన తెలిపారు మానవతా దృక్పథంతో సీఎం కేసీఆర్ దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆర్దిక సహాయాన్ని మంజూరు చేస్తున్నారని అన్నారు వైద్య చికిత్స చేసుకోలేక ఆర్దిక ఇబ్బందులు పడుతున్న ఎన్నో కుటుంబాలకు ఈఫండ్ ఆసరాగా నిలుస్తుంది బాధితులు అవసరమైన సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ ను సద్వినిమెాగపర్చుకొవాలి అని  అన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు వీరు నాయక్, మహేందర్ వార్డు మెంబర్  హరి శంకర్ ,సీనియర్ నాయకులు మోహన్,జగన్, రమేష్, నెహ్రూ,కాసర్ల రవి, పున్నయ్య తదితరులు పాల్గొన్నారు.