చారిత్రాత్మక నిర్ణయాలతో సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు

Submitted by Sathish Kammampati on Fri, 16/09/2022 - 12:14
CM KCR will remain in history with historic decisions

 

  1. వందల కోట్లతో నిర్మించిన సచివాలయానికి ప్రపంచ మేధావి బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం గర్వించదగ్గ విషయం
  2. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
  3. తెలంగాణ నూతన సచివాలయానికి బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టడాన్ని హర్షిస్తూ నకిరేకల్ లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

నల్లగొండ సెప్టెంబర్ 15(ప్రజాజ్యోతి): చారిత్రాత్మక నిర్ణయాలతో సీఎం కేసీఆర్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారనీ నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య అన్నారు,వందల కోట్లతో నిర్మించిన సచివాలయానికి ప్రపంచ మేధావి బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం గర్వించదగ్గ విషయమని ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ని కొనియాడారు, తెలంగాణ నూతన సచివాలయానికి ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టడం పై హర్షం వ్యక్తంచేస్తూ నకిరేకల్ పట్టణ కేంద్రంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఆయన పాలాభిషేకం చేశారు, అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ తెలంగాణ నూతన సచివాలయానికి బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం యావత్ జాతికి గర్వకారణమన్నారు దళిత, వెనుకబడిన వర్గాల సమానత్వం కోసం పోరాడిన మహనీయుడి పేరును వందలకోట్లతో నిర్మించిన అత్యాధునిక సచివాలయానికి పెట్టడం వలన దళిత, వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవం మరింత పెరిగిందని ఆయన అన్నారు, యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా సిఎం కేసీఆర్ కి ఋణపడి ఉంటారని ఆయన తెలిపారు.