సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటన సందర్భంగా టిఆర్ఎస్ శ్రేణుల ఘన స్వాగతం

Submitted by lenin guduru on Sat, 01/10/2022 - 22:09
స్వాగతం

సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటన సందర్భంగా టిఆర్ఎస్ శ్రేణుల ఘన స్వాగతం

చిల్పూర్, అక్టోబర్ 01, (ప్రజాజ్యోతి)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ లోని ప్రతిమ హాస్పిటల్, మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేస్తున్న సందర్భంగాతెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ఆదేశానుసారం చిల్పూర్ 
మండల టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు చిల్పూర్ మండలంలోని చిన్న పెండ్యాల జాతీయ రహదారి దగ్గర సీఎం కేసీఆర్ కు  ఘనస్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో చిల్పూరు మండల సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు చిన్న పెండ్యాల గ్రామ సర్పంచ్ మామిడాల లింగారెడ్డి, చిల్పూర్ మండల ఎంపీపీ బొమ్మిశెట్టి సరిత బాలరాజు,  చిల్పూర్ గుట్ట దేవస్థాన చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు , ఏఎంసీ డైరెక్టర్ బత్తుల రాజన్ బాబు, చిల్పూర్ మండల అధ్యక్షుడు భూక్య రమేష్ నాయక్ ఎస్సీ సెల్ నాయకులు గడ్డమీద వెంకటస్వామి తోపాటు ఎంపీటీసీలు, మార్కెట్ డైరెక్టర్లు, గ్రామ శాఖ అధ్యక్షులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు  తదితరులు పాల్గొన్నారు.