పెద్దన్నగా సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన జడ్పీ చైర్మన్

Submitted by Yellaia kondag… on Sat, 24/09/2022 - 11:25
CM KCR as elder  Bathukamma sarees were distributed by ZP Chairman

తుంగతుర్తి, సెప్టెంబర్ 23 (ప్రజా జ్యోతి): తెలంగాణ మహిళలందరికీ సీఎం కేసీఆర్ పెద్దన్న గా వ్యవహరిస్తూ మహిళల సాధికారత కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని జడ్పీ చైర్మన్ గుజ్జ దీపిక యుగంధర్ రావు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని దేవుని గుట్ట తండా గ్రామంలో గ్రామ సర్పంచ్ గుగులోతు ఈరోజి అధ్యక్షతన ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ ఆవరణలో బతుకమ్మ చీరలను జడ్పీ చైర్మన్ గుజ్జ దీపిక యుగంధర్ రావు  పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూటీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం బతుకమ్మ చీరలను, తెలుగింటి ఆడపడుచులకు పంపిణీ చేస్తుందని, ఈ అవకాశాన్ని మహిళలందరూ ఉపయోగించుకోవాలని కోరారు. తెలంగాణలో ముఖ్యమైన బతుకమ్మ పండుగకు, ప్రభుత్వం మహిళలకు చీరలు అందించడం ఆనందంగా ఉందని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైనవారికి అందించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని,పేద ప్రజల కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను చేపడుతోందని, టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల కోసమే పని చేస్తుందని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిసిబి డిసిఎంఎస్ డైరెక్టర్ గుడిపాటి సైదులు, ఎంపీడీవో భీమ్ సింగ్ నాయక్, తహసిల్దార్ రాంప్రసాద్, గ్రామ ఎంపీటీసీ ఆంగోత్ నరేష్, టిఆర్ఎస్ జిల్లా నాయకులు గుండ గాని రాములు గౌడ్, ఎంపీడీవో, ఎమ్మార్వో కార్యాలయ సిబ్బంది, స్థానిక ప్రజా ప్రతినిధులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.