తెలంగాణ ఆడపడుచులకు పెద్దన్నగా సీఎం కేసీఆర్:ఎంపీపీ, జెడ్పీటీసీలు.

Submitted by veerareddy on Wed, 28/09/2022 - 09:58
CM KCR is big for Telangana women: MPP, ZPTC.

గుర్రంపోడ్:సెప్టెంబర్ 27(ప్రజా జ్యోతి),./// తెలంగాణ రాష్ట్రంలోని ఆడపడుచులకు ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దన్నయ్యలా వ్యవహరించి ఆదుకుంటున్నాడని గుర్రంపోడు ఎంపీపీ,నల్లగొండ జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు మంచి కంటి వెంకటేశ్వర్లు,జెడ్పీటీసీ గాలి సరిత రవికుమార్ గౌడ్ లు అన్నారు.మంగళవారం గుర్రంపోడు మండల కేంద్రంలోని రహదారి బంగ్లాలో ఏర్పాటుచేసిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మస్రత్ జహ సయ్యద్ మియా తో కలిసి పాల్గొని ఆడపడుచులకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో అతి ముఖ్యమైన పండుగగా జరుపుకునే బతుకమ్మ పండుగ సందర్భంగా 18 సంవత్సరాలు నిండిన ఆడపడుచులందరికీ చీరలను పంపిణీ చేసి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ వారికి పెద్దన్నయ్యలా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి వర్యులు కేసిఆర్ కు ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఏ జానయ్య,ఏపీఎం మైశేశ్వర్ రావు, ఏపీవో గోపాల్ రెడ్డి, మండల కేంద్ర ఉపసర్పంచ్ పగిళ్ల లాలయ్య,మండల తెరాస అధ్యక్షుడు గజ్జెల చెన్నారెడ్డి, యువజన అధ్యక్షుడు కుప్ప పృథ్వీరాజ్,మండల బీసీ సంఘం అధ్యక్షుడు రావుల సైదులు గౌడ్, తెరాస నాయకులు షేక్ సయ్యద్ మియా,జాల యాదయ్య,యడవల్లి రమేష్,వార్డు సభ్యుడు మురళా చారి తదితరులు పాల్గొన్నారు.