గొప్ప పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ.

Submitted by srinivas on Tue, 27/09/2022 - 12:01
Chakali Ailamma was a great fighter.

ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు                        
 భూపాలపల్లి, సెప్టెంబర్ -26 ప్రజాజ్యోతి ..//...వీరనారి చాకలి ఐలమ్మ గొప్ప పోరాట యోధురాలు అని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు.  చాకలి ఐలమ్మ 127వ జయంతిని పురస్కరించుకొని సోమవారం కలెక్టరేట్ లో   చాకలి ఐలమ్మ చిత్ర పటానికి కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ తెలంగాణ పౌరుషాన్ని, పోరాటాన్ని, త్యాగాన్ని భావి తరాలకు అందించి ఉద్యమ స్ఫూర్తిని రగిల్చిన గొప్ప పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని వీరి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జెసి స్వర్ణలతా, జిల్లా బీసీ సంక్షేమ అధికారిని శైలజ, ఏఓ మహేశ్ బాబు , రజక  సంఘ నాయకులు  , అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు