జిల్లా కలెక్టర్ తో సమావేశం అయిన కేంద్ర ప్రభుత్వ బృందం

Submitted by Sathish Kammampati on Wed, 14/09/2022 - 16:57
The central government team met with the district collector

 

  • క్షయ నివారణ విభాగము న్యూఢిల్లీ నుండి వచ్చిన డాక్టర్ల బృందం

నల్లగొండ సెప్టెంబర్ 14(ప్రజాజ్యోతి) గత మూడు రోజులుగా జిల్లాలో పర్యటించి క్షయ నివారణ  కార్యక్రమం పై జిల్లాలోని పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాములను సందర్శించారు. క్షయ వ్యాధి బాధితుల వివరాలను నమోదు చేసుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రములోని రికార్డులను పరిశీలించారు. మరియు క్షయ వ్యాధి ఉన్న రోగుల నుండి సేకరించిన నమూనాలను మైక్రోస్కోప్ ద్వారా పరిశీలించారు.స్టోరు రూమ్ లో నిల్వ ఉంచిన వివిధ రకాల మందులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలలో ప్రభుత్వ వైద్యులతో పాటు సిబ్బంది. పర్యటించి క్షయవ్యాధి గ్రస్తూలకు మెరుగైన వైద్య సేవలుఅందించాలని వారు సూచించారు. గ్రామాలలో గుర్తించిన సదరు రోగులకు చెందిన పూర్తి వివరాలను ని-క్షయ్ వెబ్ పోర్టల్ లో నమోదు చేయాలని సూచించారు.

మరియు అవగాహన సదస్సులో ఏర్పాటు చేసి ప్రజలకు క్షయ వ్యాధిపై అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలోని అన్ని డివిజన్ లలోని జాతీయ క్షయ నివారణ కార్యక్రమము యొక్క సేవలను సమీక్షంచారు.  మరియు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని ఎండిఆర్ టిబి వార్డును సందర్శించారు. ఈ బృందము పలు సూచనలు చేశారు. 2025 వ సంవత్సరము వరకు క్షయ వ్యాధిని భారతదేశము నుండి తరిమికొట్టాలని  సూచించారు.జిల్లాలోని పలు వ్యాధి గ్రాస్తుల ఇంటి వద్దకు వెళ్లారు.

ప్రభుత్వ ఆసుపత్రిలోని సిబినాట్ వ్యాధి నిర్థారణ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు మరియు వ్యాధి నుండి కోలుకున్న వారు వివరాలను సేకరించారు. అనంతరము జిల్లా కలెక్టర్ తో సమావేశమై పూర్తి నివేదికను కలెక్టర్ కు సమార్పించారు. అనంతరము జిల్లా క్షయ నివారణ అధికారి న్యూఢిల్లీ నుండి వచ్చిన బృందాన్ని సత్కరించారు. వారి వెంట జిల్లా క్షయ నివారణా ధికారి డా. కళ్యాణ్ చక్రవర్తి ,డా.జూలియాన,రీజీనల్ డైరెక్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా,డా.రిచర్డ్ సామ్యూల్, స్టేట్ ప్రాజెక్ట్ కో అర్దినేటర్,ద యూనియన్, న్యూఢిల్లీ డా.రాజేశం, సంచాలకులు, క్షయనివారణ విభాగం, తెలంగాణ మరియు డా.మహేష్ గొర్ల,డా. జయకృష్ణ ,  డా.స్టేల్లా ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రతినిధులు మరియు డా. దీప,డా. రవి ప్రసాద్,డా.సమీయూద్దిన్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.