కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితులందరికి సమాన హక్కులు కల్పించాలి -

Submitted by venkat reddy on Sat, 24/09/2022 - 12:10
Central and state governments should provide equal rights to all Dalits

-తెలంగాణ రాష్ట్ర దళిత బంధు సంఘం జిల్లా అధ్యక్షుడు పోలె రవి

ఫోటో రైటప్ ః దళిత బంధువుల ఐక్య మహాసభ  కరపత్రం ఆవిష్కరణ

నిడమనూరు, సెప్టెంబర్23(ప్రజాజ్యోతి):కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితులందరికి సమాన హక్కులు కల్పించాలని తెలంగాణ రాష్ట్ర దళిత బంధు సంఘం జిల్లా అధ్యక్షుడు పోలె రవి అన్నారు . నిడమనూరు మండల కేంద్రంలో తెలంగాణ దళిత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అక్టోబర్ 03న హాలియా విశ్రాంతి ఉద్యోగుల భవనంలో నిర్వహించే  దళిత బంధువుల ఐక్య మహాసభ కరపత్రాన్ని శుక్రవారం తెలంగాణ రాష్ట్ర దళిత బంధు సంఘం జిల్లా అధ్యక్షుడు పోలె రవి ఆవిష్కరించారు.ఈసందర్భంగా  దేశంలో, రాష్ట్రంలో దళితులందరికి సమాన హక్కులు ప్రభుత్వాలు అందించాలి. విద్య , వైద్య ,ఉద్యోగ, రాజకీయ ,ఆర్థిక తదితర వ్యవస్థలో దళితులు పని చేసే ప్రతి చోటా వారికి తగిన గౌరవం దక్కేలా చూసి దళితులందరూ ఐక్యంగా ఉండాలనే సద్భావంతో వారి పక్షాన తెలంగాణ తదితర సంక్షేమ సంఘం పోరాటం చేస్తుందని అన్నారు.అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితులకు రాజ్యాంగ ప్రకారము అందవలసిన రాజ్యాంగ ఫలాలను తుచా తప్పకుండా అందించాలని కోరారు. రాష్ట్రంలో నిర్వహిస్తున్న సంక్షేమ హాస్టళ్ల నిర్వహణ సరిగ్గా నిర్వహించాలని కోరుతున్నాం. అదేవిధంగా దళితులకు కేటాయించిన బడ్జెట్ ను పూర్తిగా వారికే  కేటాయించి దళితుల అభివృద్ధికి తోడ్పడాలి.ప్రభుత్వాలు ఎన్నికలలో దళితులకు ఇచ్చిన హామీలను పూర్తిగా అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెరుమాళ్ళ మట్టయ్య, అనుముల అంజి, దుబ్బా కోటేష్, పోలేపల్లిరాంబాబు, వనమాలి కోటి, కాశీ, తదితరులు, పాల్గొన్నారు.