సాతార్ల గ్రామానికి బ్రిడ్జి లేక అవస్థలు పడుతున్న ప్రజలు

Submitted by veerareddy on Fri, 30/09/2022 - 13:02
Bridge to Satarla village or people suffering

అల్లంపూర్,(ప్రజాజ్యోతి ) సెప్టెంబర్ 29:   ఇటిక్యాల మండలం సాతర్ల గ్రామంలో రాత్రి కురిసిన వర్షానికి వాగులు వంకలు ఏకమై పొంగి పొర్లుతున్నాయి అలాగే గ్రామానికి సమీపంలో ఉన్నా పెద్ద వాగు భయంకరమైన రీతిలో పొంగి పొర్లు తునందున సాతర్ల గ్రామ ప్రజలకు వైద్యం కోసం గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి  వెళ్లాలన్న ఇటిక్యాల ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలన్న పెద్దవాగు దాటలేక ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు చాలా ఉన్నాయి,  వ్యవసాయ పనులకు వెళ్ళాలి అనుకున్నా వాగుదాటి పోవాల్సిందే సాతర్ల గ్రామా ప్రజలు అధికారులకు ఎన్నిసార్లు విన్న వించిన నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు తప్పా గ్రామ ప్రజలకు న్యాయం చెయ్యడం లేదు, ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే బ్రిడ్జిని నిర్మించి సాతర్ల  గ్రామా ప్రజలకు న్యాయం చేయాలని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తంచేశారు.