ఘనంగా బియబాని ఉర్సు ఉత్సవాలు

Submitted by veerareddy on Tue, 27/09/2022 - 11:38
Biyabani Ursu celebrations in grand style

కాజీపేట, సెప్టెంబర్25 (ప్రజాజ్యోతి).///.. కాజీపేట లోని హజరత్ సయ్యద్ షా బియబాని దర్గా ఉత్సవాలలో రెండవ రోజు ఆదివారం మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు భారీగా తరలి రావడంతో దర్గా ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. తెల్లవారుజామున జరిగిన సందల్ కార్యక్రమంలో దర్గా పీఠాధిపతి  ఖుస్రు పాషా యువ పీఠాధిపతి భక్తి యార్ బియబాని ప్రత్యేక ప్రార్థనలు చేసి ఉత్సవాలను ప్రారంభమైనట్లుగా తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పీఠాధిపతులు ప్రత్యేక పీఠాధిపతులు కులమత బేధాలు లేకుండా వేలాదిమంది భక్తులు దర్గాను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేసి ఫుల్ చాదర్ కప్పి భక్తి ప్రవర్తతను చాటుకున్నారు. కులమత లకు తావు లేకుండా తమ కోరికలను తీర్చమని కొందరు గతంలో మొక్కుకున్న కోరికలు తిరి పోవడంతో భక్తులు మొక్కులు. చెల్లించుకున్నారు. దేశంలోని దాదాపు 25 దర్గా మత పెద్దలు బియాభాని దర్గాను పీఠాధిపతి ఖుస్రు పాషా ను ఆశీర్వదించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పీఠాధిపతులు మత పెద్దలు రాత్రి జరిగిన కావ్వాలి భక్తి భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. బియాభాని ఉత్సవాలకు తెలంగాణ రాష్ట్రం నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు రావడంతో దర్గా ప్రాంత నిండిపోయింది. తరలివచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను వసతులను కల్పించారు. దర్గా ప్రాంతంలో హాల్లో మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన భద్రకాళి మన ప్రధాన అర్చకుడు శేషు శర్మ క్రైస్తవ మత పెద్ద ఐజాక్ వివిధ చూపి దర్గాలకు చెందిన 25 మంది పీఠాధిపతులు ప్రత్యేక ప్రార్థనలు చేసి ప్రసంగించారు. దర్గా ప్రాంతంలో సిపి తరుణ్ జోషి ఆదేశాలతో సెంట్రల్ జోన్ డీసీపీ అశోక్ కుమార్ నేతృత్వంలో కాజీపేట ఏసిపి శ్రీనివాస్ మకాం వేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దర్గా పరిసర ప్రాంతాలలో సిఐ మహేందర్ రెడ్డి పోలీస్ బందోబస్తు నిర్వహించారు. దర్గా ప్రాంతంలో జరుగుతున్న ఉత్సవాలలో ఎవరైనా పిల్లలు తప్పిపోయిన పోలీసులు ప్రత్యేక హెల్ప్ డెస్క్ కంట్రోల్ ఆధ్వర్యంలో పిల్లలను తల్లిదండ్రులకు అప్పగించారు.

నేడు పకీర్ల విన్యాసాలు..

బియబాని ఉత్సవాలలో ముగింపు కార్యక్రమంలో భాగంగా సోమవారం దర్గా ప్రాంతంలో ఫకీర్ల విన్యాసాలు ఉంటాయి. ఇప్పటికే బియబానీ దర్గా ఉత్సవాలలో విన్యాసాలు ఎందుకు సుమారు 80 మంది పకీర్లు దర్గాకు చేరుకున్నారు. ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విన్యాసాలు మధ్యాహ్నం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నేడు ఎవరి ఉత్సవాల సందర్భంగా భక్తుల రాక కూడా పెరుగుతుంది. సోమవారం చివరి రోజు కావడంతో భక్తులు సంఖ్యల హాజరయ్యే వారికి ప్రత్యేక ప్రార్థనలు చేసుకోవడానికి అవకాశం ఉందని దర్గా పీఠాధిపతి ఖుస్రు పాషా తెలిపారు.