భగత్ సింగ్ జయంతిని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి.

Submitted by shaikmohammadrafi on Thu, 29/09/2022 - 13:24
Bhagat Singh Jayanti should be officially organized by the central government.

భగత్ సింగ్ ఉద్యమ స్ఫూర్తితో యువత హాక్కుల సాధనకై ముందుకు సాగాలి.

నడిగూడెం, సెప్టెంబర్ 28, ప్రజా జ్యోతి: స్వాతంత్ర ఉద్యమ యువ కెరటం షాహిద్ భగత్ సింగ్ 115 వ జయంతి సందర్భంగా భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ నడిగూడెం మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో భగత్ సింగ్ 115వజయంతి నిర్వహించారు. 
ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు,సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కాసాని కిషోర్ హాజరై మాట్లాడుతూ ఆనాడు బ్రిటిష్ పాలనను వ్యతిరేకిస్తూ స్వాతంత్ర ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగిసిన ఎర్ర యువ కిరణం భగత్ సింగ్ అని వారు అన్నారు. భగత్ సింగ్ ఆశయాలకు అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతి యువకులకు చేస్తున్న అన్యాయాలపై కాలరాస్తున్న హక్కులపై డివైఎఫ్ఐ పనిచేస్తుందన్నారు. 23 సంవత్సరాల యుక్త వయసులో ఉరి కొయ్యలను ముద్దాడిన విప్లవ యువ కిశోరం షాహిద్ భగత్ సింగ్ అని వారు గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ భృతి వెంటనే ఇవ్వాలని నష్టంలో వివిధ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని అన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేటి తరం విద్యార్థులకు యావత్ యువతకు పిన్న వయసులోనే స్వాతంత్ర ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేసి తన ప్రాణాల్ని సైతం అర్పించిన షాహిద్ భగత్ సింగ్ యొక్క జీవిత చరిత్ర అని పాఠ్యాంశాల్లో చేర్చాలని, భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. మీది యువత భగత్ సింగ్ మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలి అన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యుడు మండల అధ్యక్షుడు జమ్మి ఎల్లయ్య, కాసాని చందర్రావు, కోరుట్ల బ్రహ్మయ్య, గోలి బాబు, కొండూరు శంకర్, మేక నరేందర్ తదితరులు పాల్గొన్నారు.